కొన్ని కేసులను ఛేదించే క్రమంలో పోలీసులకు ఏ మాత్రం క్లూ దొరకకుండా ఉంటాయి. అటువంటి సమయంలో వాళ్లు ముందుగా సీసీ కెమెరాల్లో నేరానికి సంబంధించిన ఏమైనా ఆధారాలు దొరుకుతాయో చూస్తారు. అయినా ఇంకా ఆ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియకపోవచ్చు. అటువంటి సందర్భంలో టెక్నాలజీని ఉపయోగించుకుంటారు.
అయినా నేరస్తుల వివరాలు దొరక్కపోతే డాగ్ స్క్వాడ్స్ ను కూడా ఉపయోగించుకుంటారు. ఈ డాగ్స్ పోలీసుల పర్యవేక్షణలో పూర్తిగా శిక్షణ పొంది ఉంటాయి. నేర పరిశోధనలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తుంటాయి. అయితే ఓ శునకం కేవలం 20 నిమిషాల్లోనే ఆరుగురు రేపిస్టులను పట్టుకుంది. అవును మీరు విన్నది నిజమే..
గుజరాత్ లోని వడోదర పోలీస్ డాగ్ స్క్వాడ్‌లోని శునకం 30 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ దుండగులను.. ఆ తర్వాత ఆమెను హత్య చేసిన వారిని ఆ శునకం పట్టుకొని ఆశ్చర్యానికి గురిచేసింది. మొదట ఆ డాగ్ కు నిందితులు పారిపోయిన దిశను చూపించారు. దాన్ని పసిగటట్టిన ఆ డాగ్.. దాదాపు రెండు కిలోమీటర్లు పరుగెత్తి.. అక్కడ ఓ టెంట్ వద్ద ఆగింది.
అక్కడ ఆ డాగ్ మొరగడం మొదలు పెట్టింది. డాగ్ తో పాటు వచ్చిన స్క్వాడ్ అక్కడే ఉన్న రేపిస్టులను పట్టుకున్నారు. ఇలా వారికి నేరస్థులను పట్టుకోవడంలో డాగ్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పోలీసులు చెప్పుకొచ్చారు. ఇలా ఆ రేపిస్టులను పట్టుకోవడంలో ఉపయోగపడిన డాగ్ పేరు ‘జావా’ అని పోలీసులు పేర్కొన్నారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…