సాధారణంగా పిల్లలు పుడితే వారు తండ్రి పోలిక ఉండాలన్న నియమం ఏదీ లేదు. పిల్లలు తల్లి తండ్రి పోలిక లేదా వారి కుటుంబ సభ్యుల పోలికలు ఉండటం సర్వసాధారణం. అయితే ఓ తండ్రి తన బిడ్డ తన పోలికలతో పుట్టలేదని ఆ బిడ్డపట్ల అతి కిరాతకంగా ప్రవర్తించి తనని హత్య చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈ ఘోర ఘటన చోటుచేసుకుంది. కళ్యాణదుర్గం పట్టణ వాసికి రెండు నెలల క్రితం ఒక కూతురు జన్మించింది. అయితే తన కూతురు తన పోలికలతో లేకపోవడంతో తన బిడ్డ కాదని ఆ తండ్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన బిడ్డను చంపేస్తానని హెచ్చరించాడు. ఈ క్రమంలోనే అనుకున్న విధంగానే గురువారం సాయంత్రం తన బిడ్డను ఎత్తుకొని ఇంటి నుంచి పారిపోయాడు.
ఇది గమనించిన కుటుంబ సభ్యులు తన బిడ్డను ఎక్కడ చంపుతాడని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ తండ్రి బిడ్డ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన ఎలాంటి ఫలితం లేకపోయింది. ఇలా కొన్ని గంటల సమయం తర్వాత ఒక ఒక సంచిలో పాప నిర్జీవంగా మృతి చెంది కనిపించడంతో ఆ తల్లి ఆవేదన భరించలేకపోయింది.
కేవలం తన పోలికలతో బిడ్డ పుట్టే లేదన్న కారణంగా ముక్కుపచ్చలారని ఆ చిన్నారి నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా అతి దారుణంగా చంపిన తండ్రి పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఇలా ముక్కుపచ్చలారని అభం శుభం తెలియని చిన్నారి విగతజీవిగా పడి ఉండటంతో ఆ తల్లి రోదన వర్ణనాతీతం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…