తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత గత కొద్దిరోజుల నుంచి తన విడాకుల విషయమై సోషల్ మీడియాలో తన గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సమంత నాగచైతన్య విడాకులు ప్రకటన తర్వాత విడాకులు తీసుకోవడానికి గల కారణం సమంత అంటూ సమంత గురించి పలురకాల వార్తలు రాస్తున్నారు. ఇకపోతే విడాకుల ప్రకటన తర్వాత సమంత తనలో ఉన్నటువంటి బాధను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
సాధారణంగా సెలబ్రిటీలు నటించిన సినిమాలు టీవీలో వస్తే ఎంతో ఆసక్తిగా ఆ సినిమాలను వీక్షిస్తారు. కానీ సమంత మాత్రం తన సినిమాలు టీవీలో వస్తే మాత్రం చూడనని వెంటనే టీవీ ఆఫ్ చేస్తానని పేర్కొన్నారు. ఎందుకంటే గతంలో తనకు నటన గురించి పూర్తి అవగాహన లేకపోవడంతో కొన్ని తప్పులు జరిగి ఉంటాయని అందుకే తనకు ఆ సినిమాలో చూడటానికి ఇష్టం ఉండదని తెలిపారు.
అలాగే గతంలో తాను నటించిన సినిమాలన్నీ కూడా ఒకే ధోరణిలో ఉండటం వల్ల తనకు ఆ సినిమాలను మళ్ళీ మళ్ళీ చూడాలి అంటే నచ్చదని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.ఎప్పుడు అలాంటి మూసధోరణిలోనే కాకుండా ఓ విభిన్నమైన ప్రయోగాత్మక పాత్రలో నటించాలన్న ధైర్యంతోనే ముందడుగు వేశానని, అందుకోసమే ది ఫ్యామిలీ మెన్ 2 సిరీస్లో విభిన్న పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చానని ఈమె తెలిపారు.
ఇక ప్రస్తుతం సమంత శాకుంతలం అనే పౌరాణిక చిత్రంలో నటించిన సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా విడాకుల ప్రకటన అనంతరం సమంత మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…