పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమా అవకాశాలతో దూసుకు పోతున్నాడు.వకీల్ సాబ్ సినిమాతో హిట్ టాక్ ను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఒకవైపు భీమానాయక్ సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడం కోసం షూటింగ్ పనులు శరవేగంగా పూర్తి చేసుకుంటున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగం వరకు కంప్లీట్ చేసుకున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తొలి పీరియాడికల్ డ్రామా ఇది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక బందిపోటు దొంగల కనిపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరొక అప్డేట్ అందర్నీ ఊరిస్తుంది. ఈ వార్త విన్న చాలా మంది ఇది నిజమేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
ఇంతకీ ఆ న్యూస్ ఏమిటంటే పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరా నందన్ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇందులో ఒక చిన్న పాత్రలో అఖీరా కనిపించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. పాత్ర చిన్నదే అయినప్పటికీ ఈ సినిమాలో చాలా కీలకమని అందుకే అన్ని విధాలుగా ఆలోచించి దర్శకుడు ఆ పాత్రకోసం అఖీరా ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకు మొదట పవన్ కళ్యాణ్ ఒప్పుకోక పోయినప్పటికీ ఆ తర్వాత దర్శకుడు క్రిష్ రిక్వెస్ట్ చేయడంతో సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇందులో అఖీరా కు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే సినిమాలో అఖిరా కనిపిస్తున్న విషయం సస్పెన్స్ లో పెట్టి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారట క్రిష్. ఒకవేళ సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తలే కనుక నిజమైతే ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండగే పండగ. ఇందులో నిజానిజాలు తెలియాలి అంటే , అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే మరి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…