తెలుగు సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికలు ముగిసిన కూడా, అందుకు సంబంధించిన వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇందుకు సంబంధించి ఈ రోజు ఏదో ఒక వార్త తెరమీదకు వస్తూనే ఉంది. ఈ మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించే విధంగా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఇక మా ఎన్నికల తరువాత ఈ వ్యవహారం చల్లబడుతుంది అనుకుంటే, ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఈ విషయం మరింత ముదిరేటట్లు కనిపిస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఎన్నికల వ్యవహారం మీద నటుడు ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్ చేశారు. ఈ మా ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం అందరికి తెలిసిందే. ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన రెండవ రోజు నుంచే రాజీనామాల పర్వం కూడా మొదలయింది. మొదట ప్రకాష్రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులు ఆయనకు సపోర్ట్ చేసిన నాగబాబు అందరూ మా అసోసియేషన్ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
వాటిని మంచు విష్ణు ఆమోదించలేదు అని చెబుతున్నప్పటికీ ప్రకాష్ రాజు మాత్రం ఎన్నికల రోజు సీసీ టీవీ ఫుటేజ్ కావాలని కోరుతున్నారు. మా ఎన్నికల రోజున బయటి వ్యక్తులు వచ్చారని, మోహన్ బాబు బెదిరించాడని తనీష్, బెనర్జీ కూడా ఇదే విషయాన్ని కన్నీళ్ళు పెట్టుకొని సైతం మీడియా ముందు వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రకాష్ మాత్రం సీసీ టీవీ పుటేజ్ ఇస్తే దానిని పరిశీలించి అవసరమైతే కోర్టుకు వెళ్తానని చెబుతున్నారు.మా ఈ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొందరు రౌడీషీటర్లు ఓటు వేయడానికి వచ్చి ఆర్టిస్టులను భయపెట్టారని ప్రకాష్ ఆరోపిస్తున్నారు.
అంతేకాకుండా ప్రకాష్ ఫిర్యాదులో కౌంటింగ్ హాల్లో నూకల సాంబశివరావు అని ఒక రౌడీషీటర్ ఉన్నాడని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో సాంబశివరావు మీద రౌడీషీట్లు ఉన్నాయని చెబుతున్నారు. అతడిపై పలు కేసులు కూడా ఉన్నాయని ప్రకాష్ రాజ్ ఆరోపిస్తున్నాడు. ఈ విషయం పట్ల ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రకాష్ రాజ్ ఆరోపిస్తున్నారు. తాజాగా నూకల సాంబశివరావు ఫోటోలు కూడా తన ట్విట్టర్ ఖాతాలో కూర చేశారు. డియర్ ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్ గారు ఇది బిగినింగ్ మాత్రమే, మాకు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి ఇప్పుడు ప్రపంచానికి మా ఎలక్షన్లు ఏవిధంగా జరిగాయి అనేది మేము తెలియజేస్తాము అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…