మన దేశం రోజు రోజుకీ అభివృద్ధి చెందుతున్నప్పటికీ చాలామందిలో లింగ వివక్షత అనేది ఎక్కువగా ఉంది. ఆడపిల్ల పుట్టిందని తెలియగానే తల్లిదండ్రులు ఎంతో భారంగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఆడ పిల్లలని ఈ భూమిపైకి రాకముందే చిదిమేస్తున్నారు. అయితే ఇలాంటి ఆలోచన ధోరణి మారాలని అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఇద్దరూ సమానమేనని చెబుతూ.. ఆడపిల్లల పట్ల వివక్ష చూపే వారికి సరైన గుణ పాఠాలు చెబుతున్నారు హర్యానాకు చెందిన మనీష్ సైనీ.
మనీష్ సైనీ జింద్‌లోని నర్వానాకు చెందిన మోనికా సైనీని అతడు పెళ్లిచేసుకున్నాడు. పెళ్లి తర్వాత వధువును తన ఇంటికి తీసుకు రావడానికి మనిష్ ఏకంగా హెలికాఫ్టర్ అద్దెకు తీసుకొని అత్తవారింటికి ఎంతో గౌరవంగా, మర్యాదపూర్వకంగా తీసుకువచ్చారు. ఇలా తీసుకు రావడానికి గల కారణాలను కూడా ఈ సందర్భంగా మనీష్ తెలిపారు.
మనీష్ తండ్రి మాజీ కౌన్సిలర్ రామ్ కుమార్ సైనీ తల్లి రంకాలీ. వీరిద్దరికీ ముగ్గురు కొడుకులు ఒక కూతురు సంతానం కలదు. వీరిద్దరి కొడుకులు పెళ్లికి కూడా పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారు. అదేవిధంగా తన కూతురికి కూడా కట్నం ఇవ్వకుండా పెళ్లి చేశారు.ఈ సమాజంలో కూతురు కొడుకు ఇద్దరూ సమానమేనని భావించివారి కొడుకులకు కట్నం తీసుకోకుండా వారి కూతురికి కట్నం ఇవ్వకుండా ఎంతో ఘనంగా వివాహాలు జరిపించారు.
ఈ సమాజానికి అమ్మాయి అబ్బాయి ఇద్దరూ సమానమేననే విషయాన్ని చాటి చెప్పాలని భావించిన మనీష్ తల్లి రంకాలీపైసా కట్నం తీసుకోకుండా తన చిన్న కోడలిని హెలికాప్టర్లో అత్తవారి ఇంటికి తీసుకు రావాలని కోరింది. ఈ క్రమంలోనే మనీష్ తన భార్యను అత్తింటికి హెలికాప్టర్లో తీసుకురావడంతో ఈ వివాహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడమే కాకుండా..ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…