వధువును అత్తింటికి హెలికాప్టర్లో తీసుకువచ్చిన వరుడు… కారణం ఏమిటంటే?

0
106

మన దేశం రోజు రోజుకీ అభివృద్ధి చెందుతున్నప్పటికీ చాలామందిలో లింగ వివక్షత అనేది ఎక్కువగా ఉంది. ఆడపిల్ల పుట్టిందని తెలియగానే తల్లిదండ్రులు ఎంతో భారంగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఆడ పిల్లలని ఈ భూమిపైకి రాకముందే చిదిమేస్తున్నారు. అయితే ఇలాంటి ఆలోచన ధోరణి మారాలని అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఇద్దరూ సమానమేనని చెబుతూ.. ఆడపిల్లల పట్ల వివక్ష చూపే వారికి సరైన గుణ పాఠాలు చెబుతున్నారు హర్యానాకు చెందిన మనీష్ సైనీ.

మనీష్ సైనీ జింద్‌లోని నర్వానాకు చెందిన మోనికా సైనీని అతడు పెళ్లిచేసుకున్నాడు. పెళ్లి తర్వాత వధువును తన ఇంటికి తీసుకు రావడానికి మనిష్ ఏకంగా హెలికాఫ్టర్ అద్దెకు తీసుకొని అత్తవారింటికి ఎంతో గౌరవంగా, మర్యాదపూర్వకంగా తీసుకువచ్చారు. ఇలా తీసుకు రావడానికి గల కారణాలను కూడా ఈ సందర్భంగా మనీష్ తెలిపారు.

మనీష్ తండ్రి మాజీ కౌన్సిలర్ రామ్ కుమార్ సైనీ తల్లి రంకాలీ. వీరిద్దరికీ ముగ్గురు కొడుకులు ఒక కూతురు సంతానం కలదు. వీరిద్దరి కొడుకులు పెళ్లికి కూడా పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారు. అదేవిధంగా తన కూతురికి కూడా కట్నం ఇవ్వకుండా పెళ్లి చేశారు.ఈ సమాజంలో కూతురు కొడుకు ఇద్దరూ సమానమేనని భావించివారి కొడుకులకు కట్నం తీసుకోకుండా వారి కూతురికి కట్నం ఇవ్వకుండా ఎంతో ఘనంగా వివాహాలు జరిపించారు.

ఈ సమాజానికి అమ్మాయి అబ్బాయి ఇద్దరూ సమానమేననే విషయాన్ని చాటి చెప్పాలని భావించిన మనీష్ తల్లి రంకాలీపైసా కట్నం తీసుకోకుండా తన చిన్న కోడలిని హెలికాప్టర్లో అత్తవారి ఇంటికి తీసుకు రావాలని కోరింది. ఈ క్రమంలోనే మనీష్ తన భార్యను అత్తింటికి హెలికాప్టర్లో తీసుకురావడంతో ఈ వివాహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడమే కాకుండా..ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here