The groom demanded a kidney as dowry at the wedding!
పాట్నా, జూన్ 10: మన దేశంలో వరకట్న నిషేధ చట్టం 1961లో వచ్చిందనేది కేవలం పుస్తకాల్లోనే ఉంది. చట్టం ఉన్నప్పటికీ, వరకట్నం అనేది సమాజంలో ఒక చీడపురుగులా కొనసాగుతూనే ఉంది. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి పెళ్లిలోనూ ఇది ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంది. కట్నం కోసం మగ పెళ్లివారి డిమాండ్లు ఎలా ఉంటాయంటే.. కారు, ఇల్లు, బంగారం, డబ్బు.. ఇలా ఒకటేమిటి అన్నీ కావాలంటారు.
బీహార్‌లో జరిగిన ఈ ఘటన వింటే షాక్ అవుతారు. పెళ్లయిన తర్వాత భర్తకు మళ్లీ కట్నం కావాలని కోరిక పుట్టింది. భార్యను బైక్, డబ్బు, నగలు అడిగాడు. ఆమె నిరాకరించడంతో ఏకంగా కిడ్నీనే కట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంతేకాదు, భర్త, అత్తమామలు కలిసి ఆమెను కిడ్నీ కోసం చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టారు. ఈ దారుణమైన సంఘటన బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో జరిగింది. బాధితురాలు దీప్తి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ముజఫర్‌పూర్‌లోని బోచాహా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న యువకుడితో 2021లో దీప్తికి పెళ్లయింది. పెళ్లయిన కొత్తలో అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత అత్తమామల వేధింపులు మొదలయ్యాయి. ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించేవారు. పుట్టింటి నుంచి బైక్, డబ్బు తీసుకురావాలని ఒత్తిడి చేసేవారు. అయితే, దీప్తి భర్త కిడ్నీలు పాడయ్యాయని తెలిసిన తర్వాత అసలు కథ మొదలైంది. బైక్, డబ్బు తేలేకపోతే నీ కిడ్నీలలో ఒకటి నా కొడుక్కి దానం చేయాలని ఆమెను వేధించడం మొదలుపెట్టారు. దీప్తి కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో ఆమెను కొట్టి ఇంటి నుంచి గెంటివేశారు.
దిక్కుతోచని స్థితిలో దీప్తి తన పుట్టింటికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లయిన రెండేళ్ల తర్వాత తన భర్త కిడ్నీ వ్యాధి గురించి తెలిసిందని, తనను కిడ్నీ దానం చేయాలని అత్తమామలు చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆమె పోలీసులకు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని రెండు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. కానీ అది విఫలం కావడంతో భర్త విడాకులు ఇస్తానని చెప్పాడు. అయితే దీప్తి విడాకులకు అంగీకరించలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
ఈ కథనం మన సమాజంలో వరకట్నం అనే దురాచారం ఎంత లోతుగా పాతుకుపోయిందో తెలియజేస్తుంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…