కేవలం ఒక మద్యం బాటిల్ కనిపించకపోవడంతో అమెరికా ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని దర్యప్తుకు ఆదేశించింది. సాధారణంగా ఒక దేశానికి చెందిన మంత్రులు, అధికారులు ఇతర దేశాల్లో పర్యటిస్తారనే విషయం తెలిసిందే. అయితే అక్కడ వారికి అభిమానంతో రకరకాల బహుమతులు ఇస్తుంటారు.
ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ హయాంలో విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న మైక్ పాంపియోకు విదేశీ పర్యటన సందర్భంగా జపాన్ ప్రభుత్వ అధికారులు సుమారు రూ.4 లక్షలు విలువ చేసే ఓ మద్యం బాటిల్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. ప్రస్తుతం ఆ మద్యం బాటిల్ కనిపించకుండా పోయింది. దీంతో అమెరికా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇదిలా ఉంటే.. జపాన్ ప్రభుత్వ అధికారులు మద్యం బాటిల్ ను గిఫ్ట్ గా ఇచ్చిన సమయంలో మైక్ పాంపియో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారని, ఆ వైన్ సీసాను అతను నేరుగా తీసుకున్నారా? లేదా అనే విషయం మీద స్పష్టత లేదని అమెరికాకు చెందిన ఓ వార్తా పత్రిక తన కథనంలో పేర్కొంది.
అయితే అమెరికాలో ఓ నిబంధన ఉంది. అదేంటంటే.. 390 డాలర్ల కంటే తక్కువ విలువ చేసే బహుమతులను తీసుకున్నప్పుడు అదనపు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ అంతకుమించి విలువైన వస్తువును బహుమతిగా తీసుకుంటే మాత్రం అమెరికా చట్టాల ప్రకారం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
అయితే ట్రంప్ హయాంలో మాత్రం ఆ మద్యం బాటిల్ కు డబ్బులు చెల్లించినట్టు ఎక్కడా పేర్కొనలేదు. దీనికి తోడు ప్రస్తుతం ఆ వైన్ బాటిల్ కూడా కనిపించకపోవడంతో అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చూడాలి మరి ఆ మద్యం బాటిల్ దొరకుతుందో.. లేదో…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…