తెలుగులో ఇప్పుడు అతిపెద్ద రియాల్టీ షో ఏదంటే.. టక్కున వచ్చే మాట బిగ్ బాస్. నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొని ఇప్పుడు ఐదో సీజన్లోకి అడుగుపెడుతోంది. అయితే బిగ్ బాస్ షో ఐదో సీజన్ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. స్టార్ మా యూనిట్ బిగ్ బాస్ షో ఐదో సీజన్‌కు సంబంధించిన లోగోను వదలడంతో అసలు కథ మొదలైంది.
అప్పటి వరకు తూతూ మంత్రంగా వచ్చిన వార్తలు, లీకులు ఒక్కసారిగా హోరెత్తిపోయాయి. అలా మొత్తంగా బిగ్ బాస్ షో అనేది ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇక కంటెస్టెంట్ల పేర్లు లీకవుతూ రోజుకో పేరు తెర మీదకు వస్తోంది. అయితే దీనిని సెప్టెంబర్ 5 నుంచి ప్రసారం చేసే విధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇక కంటెస్టెంట్ల పేర్లు లీకయిన వారిలో కొంతమంది పేర్లు ఫైనల్ కూడా అయినట్లు తెలుస్తోంది. వారిని స్పెషల్ క్వారంటైన్ లో కూడా పెట్టినట్లు సమాచారం.
అన్నపూర్ణలోని 7 ఎకర్స్ లోనే బిగ్ బాస్ 5 ప్రారంభం కాబోతోంది. దీనికి కూడా నాగార్జున హోస్ట్ గా ఉండబోతున్నట్లు సమాచారం. త్వరలో నాగార్జున మీద ప్రోమో షూట్ కూడా విడుదల చేయనున్నట్లు టాక్. అయితే ఇప్పుడు మొదటి ఎపిసోడ్ లో ఆర్ఆర్ఆర్ మూవీ బృందం సందడి చేయనున్నట్లు సమాచారం.
అంతేకాకుండా మొదటి ఎపిసోడ్ కు కొద్ది సేపు ఎన్టీఆర్ కూడా హోస్ట్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా ఫస్ట్ ఎపిసోడ్ లోనే ఇంకా చాలా సర్ ఫ్రైజ్ లు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వీటన్నింటికి తెర పడాలంటూ సెప్టెంబర్ 5 వరకు ఆగాల్సిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…