ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ పరిస్థితులు ఎంతోమందిని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది. కొందరు ఉపాధి పనులు లేక రోజు వారి ఆకలి తీర్చుకోవడం కోసం కొట్టుమిట్టాడుతుంటే మరికొందరు కరోనా బారినపడి తల్లిదండ్రులను కోల్పోయి ఎంతో మంది చిన్నారులు అనాధలుగా మిగిలారు. ఈ మహమ్మారి దాటికి రోజు ఎంతో ఆప్యాయంగా పలకరించే వారికి కరోనా వచ్చిందని తెలిసి వారిని పలకరించడానికి కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇలాంటి దుర్భర పరిస్థితులలో బిహార్ లోని అరియా జిల్లాలో బిష్ణుపుర గ్రామపంచాయతీలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో తండ్రి మరణించగా కరోనా బారినపడి నాలుగు రోజుల వ్యవధిలోనే తల్లి మరణించింది. ఈ విధంగా తల్లిదండ్రులను కోల్పోయి సోని(18), నితీష్ (14 ), చాందిని (12) అనే ముగ్గురు చిన్నారులు అనాధలుగా మిగిలారు.ఈ విధంగా తమ తల్లిదండ్రులు చనిపోతే వారి అంత్యక్రియలు నిర్వహించడానికి చేతిలో చిల్లిగవ్వ లేక పోవడంతో పెద్ద కూతురు సోని గ్రామస్తులు అందరిని తల్లి అంత్యక్రియలు నిర్వహించడం కోసం సహాయం అడిగింది. తనకు సహాయం చేయడానికి గ్రామస్తులు ఎవరు ముందుకు రాలేదు.
ఈ క్రమంలోనే సోనీ తన ఇంటి సమీపంలోనే తన తల్లి తండ్రికి అంత్యక్రియలు నిర్వహించింది. చనిపోయిన తమ తల్లిదండ్రులకు ఆత్మ శాంతి కలగాలని దశదిన కర్మకు భోజనాలు ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమంలో భోజనం చేయడం కోసం 150 మంది గ్రామస్తులు వచ్చారు. కార్యక్రమానికి వచ్చిన వారందరూ కడుపునిండా భోజనం చేసి తమ తల్లి తండ్రుల ఆస్పత్రి ఖర్చులకోసం తమ వద్ద తీసుకున్న అప్పును చెల్లించాలని వారిపై ఒత్తిడి చేశారు.
ఇలాంటి సమయంలో ఏం చేయాలో దిక్కుతోచని సోనీ తమ తల్లిదండ్రుల ఆసుపత్రి ఖర్చుల కోసం చేసిన అప్పులు చెల్లించాలని తమపై ఒత్తిడి తెస్తున్నారని ఆవేదనకు గురైంది. ఎలాగైనా ప్రభుత్వం తమని ఆదుకోవాలని కన్నీటిపర్యంతమైన ఘటన బిష్ణుపుర గ్రామపంచాయతీలో చోటు చేసుకుంది.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…