Bandla Ganesh: ఊర కుక్కలా అరవకు అంటూ బండ్ల గణేష్ పై విరుచుకుపడ్డ వైసీపీ నేత.. దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బండ్ల గణేష్…ట్వీట్ వైరల్!
Bandla Ganesh: వైసీపీ నేత రాజ్యసభ సభ్యుడు అయిన విజయసాయిరెడ్డి ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటూ బండ్ల గణేష్ సోషల్ మీడియాలో వరుస ట్వీట్స్ తో విరుచుకుపడ్డాడు. అయితే తాజాగా ఇదే విషయం పై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ బండ్ల గణేష్ ట్వీట్ కి ఘాటుగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంపీ విజయ సాయి రెడ్డి ట్వీట్స్ సంచలనంగా మారాయి.
ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ప్రత్యర్థులపై తన మార్కు ట్వీట్స్ తో విరుచుకుపడుతూ ఉంటారు విజయ సాయి రెడ్డి. మరి ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం విషయంలో చంద్రబాబు,నారా లోకేష్,పవన్ కళ్యాణ్ లాంటి ప్రత్యర్థులు చేసే ఆరోపణలపై స్పందిస్తూ ట్వీట్ చేస్తూ ఉంటాడు. ఇక తాజాగా బండ్ల గణేష్ రాష్ట్రంలోని ఒక వర్గాన్ని కించపరిచే విధంగా విజయసాయిరెడ్డి చర్యలు ఉంటున్నాయని అనడంతో ఆ విషయంపై స్పందించిన విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ..ఆకులు..వక్కలు..పక్కలు…ఇదేగా నీ బతుకు,అంత ఈజీ అనుకున్నావా ఎవరిని పడితే వాళ్లను కరవడం? ఎవడో ఉస్కో అనగానే పిచ్చి పట్టిన వీధి కుక్కలా ఎగిరెగిరి మొరుగుతున్నావ్. మొరిగి మొరిగి సొమ్మసిల్లినా ఓడలు బండ్లవుతాయి గాని, బండ్లు ఓడలు కావు. అయ్యో…గణేశా.. అంటూ విజయ సాయి రెడ్డి ఈ స్థాయిలో కౌంటర్ ఇవ్వడంతో ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే బండ్ల గణేష్ విజయసాయి రెడ్డి పై ట్వీట్ చేస్తూ..
మీకు కులం నచ్చకుంటే.. కమ్మ వాళ్ళు నచ్చకుంటే నేరుగా తిట్టండి… చంద్రబాబును టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మ వారిని తిట్టకండి. అధికారం శాశ్వతం కాదు. రేపు నువ్వు తప్పకుండా మాజీ అవుతావు. ప్రతి కమ్మ వారు తెలుగుదేశం కాదు. నేను కమ్మ వాణ్ణే కానీ టీడీపీ కాదు అని బండ్ల గణేష్ అన్నారు.. నీ పిచ్చకి, నీ కుల పిచ్చకి, నీ డబ్బు పిచ్చకి, కమ్మ కులాన్ని బలిచేయ్యాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుంది అంటూ బండ్ల ట్వీట్ చేశారు. ఈ విషయంపై విజయసాయి రెడ్డి ఆ విధంగా ఊర కుక్క అంటూ బండ్ల గణేష్ పై ట్వీట్ చేయడంతో ఆ విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…