Bandla Ganesh: వైసీపీ నేత రాజ్యసభ సభ్యుడు అయిన విజయసాయిరెడ్డి ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటూ బండ్ల గణేష్ సోషల్ మీడియాలో వరుస ట్వీట్స్ తో విరుచుకుపడ్డాడు. అయితే తాజాగా ఇదే విషయం పై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ బండ్ల గణేష్ ట్వీట్ కి ఘాటుగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంపీ విజయ సాయి రెడ్డి ట్వీట్స్ సంచలనంగా మారాయి.

ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ప్రత్యర్థులపై తన మార్కు ట్వీట్స్ తో విరుచుకుపడుతూ ఉంటారు విజయ సాయి రెడ్డి. మరి ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం విషయంలో చంద్రబాబు,నారా లోకేష్,పవన్ కళ్యాణ్ లాంటి ప్రత్యర్థులు చేసే ఆరోపణలపై స్పందిస్తూ ట్వీట్ చేస్తూ ఉంటాడు. ఇక తాజాగా బండ్ల గణేష్ రాష్ట్రంలోని ఒక వర్గాన్ని కించపరిచే విధంగా విజయసాయిరెడ్డి చర్యలు ఉంటున్నాయని అనడంతో ఆ విషయంపై స్పందించిన విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ..ఆకులు..వక్కలు..పక్కలు…ఇదేగా నీ బతుకు,అంత ఈజీ అనుకున్నావా ఎవరిని పడితే వాళ్లను కరవడం? ఎవడో ఉస్కో అనగానే పిచ్చి పట్టిన వీధి కుక్కలా ఎగిరెగిరి మొరుగుతున్నావ్. మొరిగి మొరిగి సొమ్మసిల్లినా ఓడలు బండ్లవుతాయి గాని, బండ్లు ఓడలు కావు. అయ్యో…గణేశా.. అంటూ విజయ సాయి రెడ్డి ఈ స్థాయిలో కౌంటర్ ఇవ్వడంతో ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే బండ్ల గణేష్ విజయసాయి రెడ్డి పై ట్వీట్ చేస్తూ..
నేను కమ్మ వాణ్ణే కానీ టీడీపీ కాదు ….
మీకు కులం నచ్చకుంటే.. కమ్మ వాళ్ళు నచ్చకుంటే నేరుగా తిట్టండి… చంద్రబాబును టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మ వారిని తిట్టకండి. అధికారం శాశ్వతం కాదు. రేపు నువ్వు తప్పకుండా మాజీ అవుతావు. ప్రతి కమ్మ వారు తెలుగుదేశం కాదు. నేను కమ్మ వాణ్ణే కానీ టీడీపీ కాదు అని బండ్ల గణేష్ అన్నారు.. నీ పిచ్చకి, నీ కుల పిచ్చకి, నీ డబ్బు పిచ్చకి, కమ్మ కులాన్ని బలిచేయ్యాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుంది అంటూ బండ్ల ట్వీట్ చేశారు. ఈ విషయంపై విజయసాయి రెడ్డి ఆ విధంగా ఊర కుక్క అంటూ బండ్ల గణేష్ పై ట్వీట్ చేయడంతో ఆ విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
బ్రోకర్లు, తార్పుడుగాళ్లు, మోసగాళ్లు, జేబులు కొట్టేవాళ్ళు ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళని విమర్శిస్తే పెద్దోళ్లు అయిపోతామని భ్రమపడుతుంటారు. బండ్లలాగా. ఎన్నిసార్లు తన్నులు తిన్నది, ఎవరెవరి కాళ్లుపట్టుకున్నదీ అతని జాతకం లైట్ బోయ్ నుంచి అందరికీ తెలుసు. కుక్కకాటుకు చెప్పుదెబ్బలు తప్పవు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 16, 2022
వెన్నుపోటు పేటెంటు నీ యజమాని చంద్రబాబుది. 28 ఏళ్లుగా చెక్కు చెదరని గిన్నెస్ రికార్డు. ఇంకో వందేళ్లయినా అది బాబు పేరనే ఉంటుంది. ఇంత చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లా బండ్లా? ప్రతి కుక్కా సింహం కావాలనుకుటుంది. నీలాంటి వాడే భౌ..భౌమని మొరిగి గర్జించా అనుకుని మురిసిపోతుంటాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 16, 2022
నీవు మర్చిపోయినట్టు నటిస్తున్నా సచిన్ జోషి మాత్రం నిన్ను జీవితాంతం వెంటాడుతుంటాడు. మూవీకి అతను ఫైనాన్స్ చేస్తే రైట్స్ నువ్వు అమ్ముకున్నావంట. చెప్పు తెగేలా కొట్టింది, ఫోన్ పగిలింది నిజమేనా బండ్లా? రామ్ చరణ్, ఎన్టీఆర్, పూరీలను ఛీట్ చేసినా వదిలేశారు. అందరూ వాళ్లంత మంచోళ్లు కారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 16, 2022
నేను చిన్నోన్ని నీ స్థాయి నాది కాదు.. నాది చిన్న స్థాయి. నేను మామూలు వాణ్ణి, నీవు పెద్దోడివి, రాష్ట్రం మొత్తం నీ గురించి గొప్పగా చెప్పుకుంటుంది. గొప్ప వ్యక్తివి, చరిత్ర సృష్టించావ్……………..
— BANDLA GANESH. (@ganeshbandla) April 16, 2022
నేను తల్లిదండ్రులకు పుట్టా.. నీలాగా నీతిలేని బ్రతుకు నేను బతకను. రాజకీయాల్లో ఉన్న ఇంట్లో ఉన్న ఒక నిజాయితీగా ఉంటా, ఒకరిని అభిమానిస్తా, ఒకరినే ప్రేమిస్తా, ఒకరితోనే ప్రాణం పోయేదాకా తోడుంటా నీ లాగా దొంగ వేషాలు వేయను దొంగ సాయి
— BANDLA GANESH. (@ganeshbandla) April 16, 2022


































