తెలుగు బిగ్ బాస్ 5 మొదలైనప్పుడు అందులో దాదాపు కొత్త వారు కనిపించారు. ప్రేక్షకులకు అసలు వాళ్లు పరిచయం కూడా లేదు. 19 మంది కంటెస్టెంట్లలో దాదాపు 5 నుంచి 6గురు మాత్రమే ప్రేక్షకులకు తెలిసినవాళ్లు ఉన్నారు. మిగతా వాళ్లంతా కొత్తవారే. అందులో ముఖ్యంగా చెప్పుకునే కంటెస్టెంట్ జశ్వంత్ పడాల అలియాస్ జెస్సీ.
అతడు మోడలింగ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆ ఫేమ్ కారణంగానే అతడు బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టాడు. మొదటి వారమే అతడు చాలా అగ్రెసివ్ గా ఉండి.. యానీపై చిన్న విషయమై గొడవకు కూడా దిగాడు. అతడికి గత రెండు, మూడు వారాల నుంచి వర్టిగో సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో హౌస్ లోకి ఒకటి రెండు సార్లు డాక్టర్లు కూడా వచ్చి చెక్ చేశారు. అతడి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. జెస్సి ఇప్పుడు ఉన్నట్లుండి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడని ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతుంది.
అతడికి ఎక్కువగా వాంతులు, విరేచనాలు, కంటి చూపు మందగించడం వంటి సమస్యలతో బాధపడుతుండగా.. బిగ్ బాస్ అతడిని హౌస్ నుంచి పంపించేశాడని తెలుస్తోంది. కానీ అతడిని సీక్రెట్ రూంలో ఉంచి వైద్యం అందిస్తున్నారనేది కూడా ఓ వార్త వైరల్ గా మారింది. అరోగ్యం బాగా లేని కారణంగా సీజన్ 4 లో కూడా అనూహ్యంగా గంగవ్వ, నోయల్ కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఈ సారి కూడా అతడిని పరోక్షంగా ఇంటి నుంచి బయటకు పంపించేశారా అనేది ప్రచారం జరుగుతుంది. నాగార్జున అడిగినప్పుడు కూడా ఎలాంటి బెటర్మెంట్ లేదు అని చెప్పాడు ఈయన. ఇప్పుడు జెస్సీ అలా బయటకి వెళ్తున్నాడా లేదంటే మళ్లీ తిరిగి ఇంట్లోకి వస్తాడా..? అతడి ఆరోగ్యం కుదుటపడితే.. మళ్లీ హౌస్ లోకి తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…