Featured

బాలయ్య టాక్ షోలో రెండవ అతిథిగా నాచురల్ స్టార్ నాని.. ప్రోమో వైరల్..!

నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా యాప్ లో అన్ స్టాపబుల్ టాక్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టాక్ షోలో ఇప్పటికే మొదటి ఎపిసోడ్ ప్రసారం అయ్యింది. మొదటి ఎపిసోడ్ కి మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ ప్రశ్నలకు అదిరిపోయే మోహన్ బాబు సమాధానాలు అత్యంత ప్రేక్షకులకు ఈ కార్యక్రమంపై ఎంతో ఆతృతను కలుగజేస్తాయి.

ఇలా మొదటి ఎపిసోడ్ ఎంతో విజయవంతంగా పూర్తి కావడంతో ఈ కార్యక్రమానికి రెండవ అతిథిగా ఎవరు రాబోతున్నారు అంటూ పెద్దఎత్తున చర్చలు జరిగాయి.ఈ క్రమంలోనే పలువురు స్టార్ సెలబ్రిటీల పేర్లు వినిపించినప్పటికీ ఎవరూ ఊహించని విధంగా ఈ కార్యక్రమానికి రెండవ అతిథిగా నాచురల్ స్టార్ నాని హాజరయ్యారు.

ఈ క్రమంలోనే రెండవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ను ఆహా నిర్వాహకులు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే బాలకృష్ణ వేదికపైకి రాగానే ఈరోజు ఈ కార్యక్రమానికి అతిథిగా రాబోయే వ్యక్తి మీ నుంచి వచ్చాడు అంటూ నానిని వేదికపైకి ఆహ్వానించాడు. అయితే అప్పటికి నాని రాకపోయేసరికి నాని ఎక్కడ అంటూ బాలకృష్ణ అడుగగా జనాల మధ్యలో నుంచి నాని వస్తూ మీరే కదా మీ నుంచి వచ్చిన వ్యక్తి అని చెప్పడంతో అక్కడి నుంచే వచ్చాను అంటూ నాని తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

ఈ క్రమంలోనే బాలకృష్ణ నానితో ఎంతో సరదాగా మాట్లాడుతూ నీకు గల్లీ క్రికెట్ ఆడటం వచ్చా అంటూ ప్రశ్నించారు. దీంతో తనకు గల్లీ క్రికెట్ ఆడటం వచ్చని చెప్పడంతో బాలకృష్ణ కూడా తనకి క్రికెట్ ఆడటం ఎంతో ఇష్టమని క్రికెట్ గురించి ముచ్చటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరు వేదికపై క్రికెట్ ఆడి ప్రేక్షకులను సందడి చేశారు. అదేవిధంగా నాని బాలయ్య చెప్పిన ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు అంటూ తన డైలాగులను తనకే చెప్పారు. ఇక సాయంత్రం ఉయ్యాలకు నువ్వు ఎలా రిలాక్స్ అవుతావని బాలకృష్ణ నానిని అడగడంతో సినిమాలు చూస్తూ రిలాక్స్ అవుతానని చెప్పగా పులిహోర కథలు చెప్పకు అంటూ బాలకృష్ణ పంచ్ వేశారు. ఇలా మొత్తానికి వీరిద్దరి మధ్య ఎంతో సరదాగా ఈ ప్రోమో సాగిపోయింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

11 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

12 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

19 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

19 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

20 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago