బిగ్ బాస్ 5 వసీజన్ లో సన్నీ విజేతగా నిలిచారు. ఎప్పటి నుంచో సన్నీ, షణ్ముఖ్ మధ్య పోటీ ఉంటుందని అభిమానులు అంతా భావించారు. దీనికి అనుగుణంగానే ఫైనల్ లో వీరిద్దరి మధ్యే పోటీ నెలకొంది. ఎవరు ఎంతగా క్రిటిసైజ్ చేసినా.. సన్నీ తన ఆటను ఆడాడు. దీంతో ఫైనల్లో విన్నర్ గా నిలచాడు.
బిగ్ బాస్ లో సన్నీ ప్రయాణాన్ని గమనిస్తే .. అతని ఆటలో కొన్ని అంశాలు ముఖ్య పాత్ర పోషించాయని చెప్పొచ్చు. ఫస్ట్ వీక్ లోనే షణ్ముక్ తో జరిగిన ఆర్గ్యూమెంట్ తో హైలెట్ అయ్యాడు. అక్కడ్నుంచీ మిగతా హౌస్ మేట్స్ తనని టార్గెట్ చేస్తూ గేమ్ ఆడుతున్నా కూడా అందర్నీ ఎంటర్ టైన్ చేస్తూ తనదైన స్టైల్లో గేమ్ ఆడాడు. బ్యాటిన్స్ టాస్క్ లో మగాడివైతే రా ఆడు అన్న ప్రియా మాటలకి రెచ్చిపోయాడు.
తనూ కూడా మాటకు మాట అంటూ చెలరేగిపోయాడు. దీంతో అప్పటి నుంచే సన్నీ ఆటను అభిమానులు గమనించడం ప్రారంభించారు. ఇదే టాస్క్ లో సిరి తన టీ షర్ట్ లో సన్నీ చేయిపెట్టాడని నిందలు వేయడం.. ఇవి అబద్దాలు అని నాగార్జున నిరూపించడం జరిగింది. తేరా నామినేషన్స్ జరిగేటపుడు హంటర్ గా అన్నిసార్లు తనే బయటకి వచ్చి నామినేషన్స్ ని స్వీకరించాడు. ఇక్కడ్నుంచే సన్నీ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. గుడ్ల టాస్క్ జరిగేటపుడు ప్రియా చెంప పగిలిపోద్ది అంటూ సన్నీపై విరుచుకపడినా కూడా తను టాస్క్ లో ఎంత జెన్యూన్ గా ఉన్నానో నిరూపించుకున్నాడు. దీంతో సన్నీ గేమ్ కి క్రేజ్ వచ్చింది.
టవర్ టాస్క్ ఆడేటపుడు సిరికి సన్నీకి జరిగిన గొడవలో సన్నీ హీరోగా మారాడు. ఎవిక్షన్ పాస్ ని తనకోసం సంపాదించి పెట్టిన కాజల్ కోసం వినియోగించి ఆడియన్స్ మనసులు దోచుకున్నాడు సన్నీ. అంతేకాదు, టాస్క్ లలో తన స్పాంటినిటీ జోక్స్, తన క్యారెక్టర్ తో ఫన్ చేయడం అనేది ఆడియన్స్ కి బాగా నచ్చింది
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…