ఏ దర్శకుడైనా కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం అన్నీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందే. అవకాశాల కోసం ఆవురావురనాల్సిందే. ఎంతో కష్టపడితేగాని ఇండస్ట్రీలో దర్శకుడిగా అవకాశం దక్కించుకోలేరు. కొందరికైతే అవకాశం వచ్చి ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యాక కూడా ఆగిపోయిన సందర్భాలున్నాయి. ఇక కొందరు దర్శకులు సినిమా మొదలు పెట్టాక సగం చుట్టేశాక ఆగిపోయిన సందర్భాలూ ఉన్నాయి. అలాంటి వారికి మళ్ళీ దర్శకుడిగా అవకాశం అంటే అంత ఈజీగా రాదు. అలా అవకాశాల కోసం ఇబ్బంది పడ్డవారిలో ఇప్పటి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కూడా ఉన్నారట.
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా అప్పటికే నిన్ను చూడాలని సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఉన్నాడు. అంత పెద్ద ఫ్యామిలీ హీరోతో సినిమా అవకాశం అంటే దీని వెనక అగ్ర దర్శకులు దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు ఉండటం వల్లే రాజమౌళి తన మొదటి సినిమాను ఎన్.టి.ఆర్‌తో తీసే అవకాశాన్ని ఇచ్చింది. ఈ సినిమానే స్టూడెంట్ నంబర్ 1. దర్శకేంద్రుడి పర్యవేక్షణలో వచ్చిన ఈ సినిమా రాజమౌళికి మంచి పేరే తెచ్చింది. కానీ, ఈ సినిమా సక్సెస్ వెనక రాఘవేంద్ర రావు పేరుంది కాబట్టి రాజమౌళి సోలోగా భారీ హిట్ కొట్టాలి.
అందుకే మళ్ళీ ఎన్.టి.ఆర్ హీరోగా సింహాద్రి సినిమాను తీసి భారీ హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో ఆయనకు వచ్చిన క్రేజ్ భారీ స్థాయిలోనే. దీని తర్వాత యంగ్ హీరో నితిన్‌తో సై అనే సినిమా తీశారు. ఈ సినిమా ఓ మోస్తారుగా ఆడింది. అయితే కమర్షియల్‌గా మాత్రం నిర్మాతలకు నష్ఠాలను మిగల్చలేదని చెప్పాలి. ఇక దీని తర్వాత ప్రభాస్‌తో తీసిన ఛత్రపతి సినిమా రాజమౌళి స్థాయిని మరో రేంజ్‌కు పెంచేసింది. అలాగే మాస్ మహారాజ రవితేజతో తీసిన విక్రమార్కుడు భారీ సక్సెస్ అందుకుంది.
ఇలా వరుస విజయాలతో రాజమౌళి టాలీవుడ్‌లో సెటిలయ్యారు. కానీ ఆయన ఎప్పుడు పెద్ద హీరోతో సినిమా చేయాలి అని ధైర్యం చేయలేదు. అందుకు ఆయనకు కొన్ని లెక్కలున్నాయని అంటారు. యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ ఇలా అన్ని సినిమాలు తనకు అనుకూలంగా ఉండే చిన్న హీరోలతోనే చేశాడు. మగధీర సినిమా చరణ్‌కు రెండవ సినిమా. ఎన్.టి.ఆర్‌తో మొదటి నుంచి మంచి రాపో ఉంది కాబట్టి వరుసగా చేశారు. నితిన్, నాని, సునీల్ అంటే తెలిసిందే.
ప్రభాస్‌కు బాహుబలి కి ముందు ఉన్న క్రేజ్ వేరే. ఆ తర్వాత ఆయన పాన్ ఇండియన్ స్టార్. ఇప్పుడు చరణ్, తారక్ కూడా అంతే. వాళ్ళతో ముందు నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నారు కాబట్టి జక్కన్న ఈజీగా సినిమా చేయగలుగుతున్నారు. అయితే ఆయనతో సినిమా చేయాలనే కోరిక మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, అల్లు అర్జున్ లాంటి వారికి ఉంది. కానీ, ఆయన మెగాస్టార్, బాలయ్య లాంటి వారితో సినిమా అంటే కాస్త టెన్షన్ వచ్చేస్తుందట. ఈ విషయాన్ని ఇటీవల ఆయనే స్వయంగా వెల్లడించారు. సీనియర్ హీరోలతో అంటే ముందు వారికి కథ సెట్ చేయడం చాలా కష్టం. ఆ తర్వాత అంచనాలు మరో రేంజ్‌లో ఉంటాయి. ఇది రాజమౌళికి పెద్ద రిస్క్. అందుకే యంగ్ హీరోలతోనే సేఫ్‌గా సినిమాలు చేస్తూ వస్తున్నారు. మరి భవిష్యత్తులోనైనా సీనియర్ హీరోలతో రాజమౌళి సినిమాలు చేస్తారా లేదా చూడాలి.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…