ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమాకు విశేష స్పందన వచ్చింది. భారీ అంచనాల మధ్య ప్యాన్ ఇండియా మూవీగా అదరగొడుతోంది. ముఖ్యంగా దేవీశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ప్యాన్స్ కు తెగ నచ్చింది.
ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప సాంగ్స్ మానియానే ఉంది. ముఖ్యంగా సమంత ఐటెం సాంగ్ ఊ అంటావా.. మావా.. ఊఊ అంటామా పాట రికార్డులు సృష్టిస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్ కలిసి సాంగ్ పెద్ద హిట్ అయింది.
తాజాగా ఈపాటపై పేరడీలు, మీమ్స్, కవర్స్ నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. దీనిపై కొంత మంది యువకులు షార్ట్ వీడియో తీశారు. ఇది కాస్త వైరల్ గా మారింది. దీనిపై సమంత కూడా స్పందించింది. ఆ షార్ట్ వీడియోట్రోలింగ్ ను సమంత ట్విట్టర్ట్ లో షేర్ చేసింది.
అంతే కాకుండా ఆ వీడియోకు స్మైలీ ఇమోజీలను కూడా పోస్ట్ చేసింది. ఆ షార్ట్ వీడియోలో ముగ్గురు యువకులు పుష్ప ఐటెం సాంగ్ ను ట్రోల్ చేశారు. ఎగ్జామ్స్ ఉన్నాయ్ కదరా.. అంటే ఎగ్జామ్ లో ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా అనే పాట రాస్తానో అనే భయం ఉందిరా.. అంటూ ఈ సాంగ్ ను ట్రోల్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…