Categories: FeaturedMovie News

ఎందుకు ఈ ఉమెన్స్ డే లు..రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు

రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే కాకుండా మంచి నటిగా కూడా ప్రేక్షకులకు తెలుసు. పవన్ తో విడాకుల తర్వాత ఆమె మరింతగా ప్రేక్షకుల నోళ్ళల్లో నానుతుంది. పవన్ అభిమానులు కొన్ని సార్లు ఆమెను టార్గెట్ చేస్తూ విమర్శించడం, దానికి ఆమెకూడా ప్రతిఘటించడం వంటివి చేయడంతో ఆమె కూడా వివాదాస్పద మహిళా గా అయిపోయారు.. ఇప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే పనిలో పడింది ఈమె. దర్శకురాలిగానే కాకుండా నటిగానూ నిరూపించుకోడానికి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతుంది రేణు దేశాయ్.

ఇక ఇన్ని రోజులు ఈమె పూణేలో ఉంది. అక్కడ్నుంచి ఇక్కడకు వస్తూ వెళ్తుంది. ఇదిలా ఉంటే ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా సోషల్ మీడియా లో అందరి అకౌంట్ లలో స్త్రీలకు శుభాకాంక్షలు చెప్తున్నారు. అయితే దాన్ని తనదైన స్టైల్ లో రేణు స్పందించారు. నేడు మహిళా దినోత్సవం అంటూ ప్రతీ ఒక్కరూ హ్యాపీ ఉమెన్స్ డే అని చెబుతున్నారు.. కానీ ఏం లాభం అంటూ రేణూ దేశాయ్ ఓ వీడియోను షేర్ చేసింది. ఓ వీధి కుక్కకు ఓ మహిళా ఆహారాన్ని పెడుతూ ఉంటే.. అక్కడి వారంతా ఆ మహిళపై దాడికి దిగారు.. చంపేస్తాం.. రేప్ చేస్తామంటూ దూషించారు. ఆ వీడియోను రేణూ దేశాయ్ షేర్ చేసింది.

ఆ వీడియో పై రేణూ దేశాయ్ కామెంట్ చేస్తూ.. ఇది నాకు మెసెజ్ రూపంలో వచ్చింది.. వీధిలోని ఓ కుక్కకు ఆహారాన్ని పెడుతూ ఉంటే కూడా సదరు మహిళపై బెదిరింపులకు పాల్పడటం, రేప్ చేస్తామని అనే మనుషులు ఉండగా.. ఇంకా ఎందుకు హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పుకోవడం.. జరుపుకోవడం అంటూ ప్రశ్నించింది. నిజానికి ఇది అందరు ఆలోచించాల్సిందే..

TD Admin

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago