సీనియర్ ఆర్టిస్ట్ కోట శ్రీనివాస రావు అంటే తెలియని వారు టాలీవుడ్ లో ఉండరు.. ఎందుకంటే అయన నటించిన సినిమాలు, పోషించిన పాత్రలు అలాంటివి.. తనదైన టైం లో కోట శ్రీనివాస రావు ఓ సెన్సేషన్ క్రియేట్ చేశారు.. తెలుగు ఇండస్ట్రీ లో తెలుగు వారు ఉండాలని ప్రత్సాహించే అతికొద్ది మంది నటులలో కోట శ్రీనివాస రావు ఒకరు. ప్రస్తుతం అయన వృద్ధాప్యం మీద పడడంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు..
విలన్ వేషాలకు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేషాలకు కోట పెట్టింది పేరు. కమెడియన్ గా కూడా కోట శ్రీనివాస రావు కొన్ని సినిమాల్లో చేశారు. అయన నవ్వించినా, ఏడిపించిన, కోపం చూపించిన కోటకు సరిలేరు నీకెవ్వరూ అన్న రీతిలోనే ఉంటుంది.తెలుగులోనే కాకుండా కొన్ని ఇతర భాష సినిమాల్లోనూ అయన నటించి ప్రేక్షకుల అభిమానాన్ని కొట్టేశారు కోట.. ఎక్కువగా వివాదాల్లోనే ఉండే కోట తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు..
డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు కనీసం వేషాలు ఇవ్వండ్రా నాయనా అంటూ కొందరు దర్శకులను తాను అడుగుతున్నట్లు చెప్పాడు కోట. తనకు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం నచ్చడం లేదని.. అందుకే ఇలా మాట్లాడుతున్నానని.. తప్పుగా అనుకోవద్దు అని చెబుతున్నాడు ఈ నటుడు. అవకాశాల కోసం ఈ మధ్య చిరంజీవి, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, వినాయక్ లాంటి వాళ్లకు ఫోన్ చేసానని చెప్పాడు కోట.పవన్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో తాను నటిస్తున్నట్లు చెప్పాడు కోట. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్‌తో నటించడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. తాజాగా విడుదలైన రాజ్ తరుణ్ పవర్ ప్లే సినిమాలో ముఖ్యమంత్రిగా నటించాడు కోట.
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…