General News

మాస్టర్ ప్లాన్ చేసిన ఓ దొంగ… చివరికి ఇలా ఇరుక్కుపోయాడు?

సాధారణంగా అనేక కారణాల వల్ల చాలామంది దొంగతనాలకు పాల్పడ్డ మనం చూస్తుంటాము. అయితే కొన్నిసార్లు వారి అదృష్టం బాగుంటే దర్జాగా బయట పడతారు. మరికొన్నిసార్లు ఇట్టే దొరికిపోతూ ఉంటారు. ఈ విధంగా దొంగతనాలకు పాల్పడి చివరికి దొరికిపోయిన సంఘటనలను గురించి మనం ఎన్నో విన్నాం. తాజాగా ఇలాంటి సంఘటన థాయిలాండ్ లోని ఓ యువకుడి విషయంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే….

ఛోబూరి పట్టణానికి చెందిన సుఫాచాయ్‌ పాంథాంగ్‌కు 27 ఏళ్లు. ఇతను గత కొంత కాలం నుంచి చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్ వేశాడు. బంగారు దుకాణంలో దొంగతనం చేయాలనే ప్లాన్ చేసిన సుఫాచాయ్‌ ప్లాన్ ప్రకారమే ఓ బంగారు దుకాణానికి కస్టమర్ లాగా వెళ్లాడు. బంగారు దుకాణానికి వెళ్లిన ఆ యువకుడు ఒక చైన్ మెడలో వేసుకుని ట్రైల్ చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే షాపు యజమాని ఏదో బిజీగా ఉండటంతో అక్కడి నుంచి చిన్నగా జారుకోవాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే వెంటనే బయటకు వెళ్లాలని డోర్ వద్దకు వెళ్లిగానే ఎంతసేపటికీ ఆ తలుపు తెరుచుకోలేదు… పాపం అక్కడ ఉన్న ట్విస్ట్ ఆ కుర్రాడు ఊహించి ఉండడు. అతడు తలుపు తెరిచి బయటకు వెళ్లాలని ఎంత గింజుకున్న తలుపు తెరుచుకోలేదు.

ఈ విధంగా తలుపు తెరుచుకోకపోవడంతో చేసేదేమిలేక ఆ యువకుడు తాను దొంగిలించిన బంగారు చైన్ తీసుకువచ్చి యజమాని ముందు పెట్టాడు. అయితే ఆ తలుపు రిమోట్ కంట్రోలర్ లో ఉంటుందనే విషయం తెలియక ఈ విధంగా దొంగతనానికి పాల్పడి అడ్డంగా బుక్కయ్యాడు.ఈ క్రమంలోనే సదరు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆ యువకుడిని అరెస్టు చేశారు. విచారణలో భాగంగా తనకు ఉద్యోగం పోయిందని తీవ్ర ఆర్థిక సమస్యల కారణంగానే ఈ విధంగా దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులకు వివరించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago