సినిమా ఇండస్ట్రీలో వారసత్వం తో వచ్చే హీరోలదే పై చేయి ఉంటుందని.. నట వారసులే తప్ప కొత్త వాళ్లని ఇండస్ట్రీలోకి రానివ్వరని చాలా సందర్భాలలో చాలామంది అప్ కమింగ్ హీరోలు చెప్పిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. తమ వారినే తీసుకు వచ్చి హీరోలుగా నిలబెట్టడానికి ట్రై చేస్తున్నారు గానీ, బయటవాళ్ళని ఎంకరేజ్ చేయరనే రూమర్ కొన్నేళ్ళుగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కొందరి విషయంలో ఇది నిజమని అనుకోవచ్చు.. కొందరి విషయంలో ఇలాంటిదేమీ ఉండదని మనకి ప్రత్యక్షంగాను కనిపిస్తుంది. అందుకు ఉదాహరణ మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, నాని, ఉదయ్ కిరణ్ లాంటి వాళ్ళే. వీరికి సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎదిగిన వారు.
అయితే కొందరికి మాత్రం ఇండస్ట్రీ నుంచి సరైన సపోర్ట్ దొరకడం లేదని వాపోతున్నారు. అలాంటి వాళ్లలో ఆనందం హీరో ఆకాశ్ ఒకరు. శ్రీనువైట్ల దర్శకత్వంలో ఆకాశ్ – రేఖా జంటగా నటించిన ఆనందం సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ప్రముఖ నిర్మాత రామోజీ రావు దీనిని నిర్మించారు. శ్రీనువైట్ల కెరీర్ లో ఇది రెండవ సినిమా. మొదటి సినిమా రవితేజతో చేశాడు. ఆ సినిమా ‘నీ కోసం’ మంచి పేరు అయితే తెచ్చుకుంది కానీ.. కమర్షియల్ గా హిట్ సాధించలేదు. అందుకు కారణం నీ కోసం సినిమాలో కామెడీ లేకపోవడమే. ఇదే స్టార్ హీరో నాగార్జున దర్శకుడు శ్రీనువైట్లకి చెప్పారు.
తమిళంలో ‘ఆనందం’ సినిమాను రీమేక్ చేయాలనుకున్నాడు.
ఈసారి నుంచి కథతో పాటు మంచి కామెడీ ట్రాక్ ఉండేలా చూసుకో నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావు అని చెప్పారు. దాంతో ఆనందం సినిమాను మంచి కామెడీ, లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో తీసి సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత ఆకాశ్ కి స్టార్ హీరో ఇమేజ్ వచ్చింది. దాంతో తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. నాలుగు సినిమాలు సైన్ చేశాడు. అలాగే తమిళంలో కూడా ఆనందం సినిమాను రీమేక్ చేయాలనుకున్నాడు. అంత క్రేజ్ ఉన్న ఆకాశ్‌కి ఇండస్ట్రీలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆయన నటించిన సినిమాలు రిలీజ్ కాకుండా చేశారని తీవ్రంగా విమర్శలు చేశారు.
ఇక్కడ మాఫియా ఉందని అందుకే నా సినిమాలను రిలీజ్ కాకుండా చేశారని అన్నారు. ‘జూన్ జూలై’ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ కావాలనే నిర్మాత ఎక్కువ డిమాండ్ చేసి సినిమా రిలీజ్ కానివ్వలేదని చెప్పారు. ఒక నిర్మాత వచ్చి మీరు సినిమా చేస్తా అంటే నాకు ఫైనాన్స్ ఇస్తా అన్నారని.. దాంతో సరే అని సైన్ చేస్తే అది చూపించి 2 కోట్లు ఫైనాన్స్ తెచ్చుకొని 1 కోటి పెట్టి ఇల్లు కట్టుకొని.. 1 కోటి సినిమాకి ఖర్చు చేశారని చెప్పాడు. ఆ సినిమాకు ఒక్క పైసా కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలిపాడు. జయం సినిమాలో హీరోయిన్ గా నటించిన సదా ‘జూన్ జూలై’ లో హీరోయిన్ అని రెండవ సినిమాగా ఇది రిలీజ్ కావాల్సి ఉంది. 7 కోట్ల మంచి ఆఫర్ వస్తే కూడా 10 కోట్లు అడిగి సినిమా రిలీజ్ కాకుండా చేశాడని బాధని వ్యక్తపరచాడు. దీని వల్లే నేను ఇండస్ట్రీకి దూరమయ్యాని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…