బుల్లితెరపై త్వరలోనే ప్రారంభం కానున్నరియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ లు ఎవరు అనే విషయం ఒక హాట్ టాపిక్ గా మారింది. గత సీజన్లో మాదిరిగానే ఈ సీజన్లో కూడా సోషల్ మీడియా సెలబ్రిటీస్, యాంకర్ ల పేర్లు వినబడుతున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా మరొక నటి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రముఖ యాంకర్ గా, పలు సీరియల్స్ లో నటించిన సిరి హనుమంత్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు బలంగా వినబడుతున్నాయి. కెరియర్ మొదట్లో యాంకర్ గా పలు చానళ్లలో పనిచేసిన ఈమె ఉయ్యాల జంపాల అనే సీరియల్ ద్వారా బుల్లితెర నటిగా పరిచయమయ్యారు. ఆ తరువాత మోహిని, అగ్నిసాక్షి వంటి పలు సీరియల్స్ లో నటించి ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు.
సీరియల్స్ మాత్రమే కాకుండా శ్రీహాన్ తో కలసి సిరి సాఫ్ట్ వేర్ బిచ్చగాళ్లు షార్ట్ ఫిల్మ్‌తో పాటు అనేక వెబ్ సిరీస్‌లలో కలిసి జంటగా నటించారు. ఈ క్రమంలోని వీరిద్దరి మధ్య ప్రేమ ప్రయాణం కొనసాగింది. ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరికీ స్టార్ మా ఛానల్లో ప్రసారం అయిన 100 పర్సంట్ లవ్ కార్యక్రమంలో వీరిద్దరికి నిశ్చితార్థాన్ని ఎంతో ఘనంగా చేశారు.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సిరి తాజాగా తన అందమైన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేశారు.సోషల్ మీడియాలో ఎంతో మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళుతున్నారని ప్రచారం వినబడుతోంది.మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే బిగ్ బాస్ నిర్వాహకులు అధికారిక ప్రకటన చేసే వరకు వేచి ఉండాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…