Niharika: నిహారిక ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోవడానికి కారణం వారేనా..?
Niharika: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో అగ్రహీరో గుర్తింపు పొందారు. ఇక ఈయన వారసులుగా మెగా కుటుంబం నుంచి ఎంతో మంది ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇకపోతే మెగా కుటుంబం నుంచి ఏకైక వారసురాలిగా నిహారిక ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
ఈమె కెరియర్ మొదట్లో యాంకర్ గా బుల్లితెరపై అరంగ్రేటం చేసి వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు పొందారు. అనంతరం పలు వెబ్ సిరీస్ లో నటించడమేకాకుండా ఒక మనసు చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇలా హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన నిహారికకు మొదటి సినిమా మంచి ఫలితాలను ఇవ్వలేకపోయింది. ఈ సినిమా తర్వాత సూర్యకాంతం హ్యాపీ వెడ్డింగ్ వంటి చిత్రాలలో నటించినా పెద్దగా సక్సెస్ కాలేదు.
ఇలా నిహారిక సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోవడంతో తిరిగి వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఈమె ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోవడానికి కారణం మెగా అభిమానులే అని చెప్పాలి. మెగా కాంపౌండ్ నుంచి మెగా వారసురాలిగా నిహారిక సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం అభిమానులకు నచ్చలేదు. అందుకే ఈమె సినిమాలను ఆదరించకపోవడంతో నిహారిక ఇండస్ట్రీలో సక్సెస్ కాలేదని చెప్పవచ్చు.
నిహారిక వివాహం చేసుకున్న తర్వాత కూడా ఇండస్ట్రీలోకి నటిగా రాకపోయినప్పటికీ వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా మారిపోయారు.అయితే ఈ మధ్య కాలంలో నిహారిక తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెద్దఎత్తున అభిమానుల సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమె తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈమె హీరోయిన్ గా కాకుండా ఇండస్ట్రీలో కీలకపాత్రలో నటించబోతున్నారని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…