Samantha: ఇది ఆరంభం మాత్రమే.. ముందు ముందు చాలా చూస్తారు.. సమంత పోస్ట్!
Samantha: విడాకుల తర్వాత సమంత పూర్తిగా తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పాలి. ప్రస్తుతం ఈమె వెకేషన్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. విడాకుల తర్వాత విదేశీ పర్యటనలలో మునిగిపోయిన సమంత తాజాగా స్విట్జర్లాండ్లో ఎంజాయ్ చేస్తోంది.
స్విజర్లాండ్ లో ఉన్న సమంత అక్కడికి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశారు. సమంత మంచు పర్వతాలలో గత కొద్ది రోజుల నుంచి స్కీయింగ్ చేస్తున్నానని అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా మంచు కొండలలో స్కీయింగ్ చేయడంతో తనకు గొప్ప అనుభూతి కలుగుతోందని తెలిపారు.
అయితే తనకు ఇప్పటి వరకు స్కీయింగ్ పై ఎలాంటి అవగాహన లేకపోవడంతో దాదాపు వంద సార్లు కింద పడిపోయానని, అయినా పట్టు వదలకుండా శిక్ష తీసుకొని ప్రస్తుతం ఎంతో అద్భుతంగా స్కీయింగ్ చేస్తున్నానని ఈమె తెలిపారు.ఈ సందర్భంగా సమంత పోస్ట్ చేస్తూ ఇది కేవలం ఆరంభం మాత్రమే… ముందు ముందు చాలా చూస్తారు అంటూ చెప్పుకొచ్చారు.
ఇలా మంచుకొండలలో సమంతకు స్కీయింగ్ శిక్షణ ఇచ్చిన కేట్ అనే శిక్షకురాలకి సమంత ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ.. తనతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సమంత ప్రస్తుతం యశోద సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇవే కాకుండా ఈమె పలు వెబ్ సిరీస్,హాలీవుడ్ చిత్రానికి కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…