Liger Movie: పూరి జగన్నాథ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం లైగర్. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో విజయ్ దేవరకొండ బాక్సర్ గా సందడి చేయనున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ ట్రైలర్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు పెంచాయి.
ఇకపోతే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో రమ్యకృష్ణ మాస్ క్యారెక్టర్ లో నటిస్తుందని తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో భాగంగా రమ్యకృష్ణ చెప్పిన మాస్ డైలాగ్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతుంది. . ” ఒక లయన్ కి టైగర్ కి పుట్టిన క్రాస్ బ్రీడ్ సాలా గాడే ఈ లైగర్” అని రమ్యకృష్ణ చెప్పిన డైలాగ్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది.
ఇకపోతే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమాలో ముందుగా విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశం స్టార్ హీరో రణబీర్ భార్య అలియా భట్ కు దక్కిందట. ఈ కథ మొత్తం విన్న అలియా తన రేంజ్ కు తగ్గ సినిమా కాదంటూ రిజెక్ట్ చేశారు.
తనకు విజయ్ దేవరకొండతో నటించాలని ఉన్నప్పటికీ కథలో హీరోయిన్ పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యత లేకపోవడంతో ఈమె వద్దని ఈ సినిమా కథను రిజెక్ట్ చేశారట.ఈ విధంగా అలియా భట్ ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశం అనన్య పాండేకి వచ్చింది.అయితే ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత వచ్చిన ఆదరణ చూస్తుంటే అలియా ఈ సినిమాని మిస్ చేసుకున్నానని ఫీల్ అవుతున్నట్లు సమాచారం. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కానుండడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా కనుక అనుకున్న స్థాయిలో హిట్ అయితే అనన్య పాండేకు తెలుగులో కూడా అవకాశాలు వస్తాయనడంలో సందేహం లేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…