Mohan Babu: కలెక్షన్ కింగ్ సీనియర్ నటుడు మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేశారు. ఇదిలా ఉండగా తాజాగా సీనియర్ నటుడు మోహన్ బాబు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా షాకింగ్ కామెంట్ చేశారు.
ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ… సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న ట్రోల్స్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా తనపై ఇద్దరు హీరోలు దగ్గరుండి మరి సోషల్ మీడియా వేదికగా తనని ట్రోల్స్ చేయిస్తున్నారని మోహన్ బాబు వెల్లడించారు.
ఈ విధంగా తన గురించి ట్రోల్స్ చేయడానికి ఏకంగా 100 మంది పని చేస్తున్నారని ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఈ విషయాన్ని మోహన్ బాబు బయటపెట్టారు. ఇక తన గురించి ఈ విధంగా వచ్చిన ట్రోల్స్ తెలిసినవారు తనకి పంపిస్తుంటారని అయితే అలాంటి వాటిని చూసినప్పుడు కాస్త బాధగా అనిపిస్తుందని ఆయన తెలియజేశారు.
ఒక వ్యక్తి గురించి ట్రోల్స్ అంటే నవ్వేలా ఉండాలి కానీ ఈ విధంగా ఒకరిని కించపరచకూడదని ఆయన వెల్లడించారు. అయితే ఆ ఇద్దరు హీరోలు ఎవరు అనే విషయం తనకు తెలుసునని ఇప్పుడు నన్ను ఈ విధంగా బాధ పెట్టడం వల్ల వారికి తాత్కాలిక ఆనందం మాత్రమే ఉంటుంది కానీ ఏదో ఒక సమయంలో వాళ్లు కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటారని నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ ఇద్దరు హీరోలు ఎవరు అనే విషయం గురించి మాత్రం మోహన్ బాబు బయటపెట్టలేదు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…