Thota Prasad : తెలుగు సినిమా పరిశ్రమలో గోస్ట్ రైటర్ గా, రైటర్ గా డైలాగ్ రైటర్ గా ఇలా పలు సినిమాలకు తన రచన సహకారం అందించిన వ్యక్తి తోట ప్రసాద్ గారు. ఆయన చిత్రజ్యోతి సినీ పత్రిక కోసం పదమూడేళ్లు పనిచేసారు. అయితే మొదట సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆపైన అక్కడి వాతావరణం నచ్చక సినిమా పరిశ్రమకు అనుబంధంగా ఉంటున్న ప్రింట్ మీడియా కోసం చాలా ఏళ్ళు పనిచేసి ఆపైన ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ తో కూడా పనిచేసారు. విజయ బాపీనీడు గారి ద్వారా సినిమా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ప్రసాద్ గారు గుణశేఖర్, పూరి జగన్నాథ్, మెహర్ రమేష్ వంటి డైరెక్టర్స్ తో కలిసి పనిచేసారు. తాజాగా ఆయన యూట్యూబ్ ఛానెల్స్ కీ ఇచ్చిన ఇంటర్వ్యూ లలో అలనాటి విశేషాలను ఆయన జ్ఞాపకాలను పంచుకున్నారు.
చిరంజీవి గారితో మనస్పర్థలకు కారణం….
ప్రసాద్ గారి సినిమా ఇండస్ట్రీ అరంగేట్రం చిరంజీవి, విజయ బాపినీడు గారి సినిమా ఖైదీ నెంబర్ 786 తో మొదలయింది. ప్రసాద్ గారు చిన్నతనం నుండే కథలు, నవలలు రాయడం అలవాటు ఉండటం వల్ల అలా పత్రికలకు రాసిన నవలను చదివిన విజయ బాపినీడు గారు మద్రాస్ రమ్మని సమాచారం పంపారట. ఇక సినిమా ఇండస్ట్రీ లో ఖైదీ నెంబర్ 786 సినిమాకు అప్రంటీస్ గా పనిచేసే సమయంలో మద్రాస్ వాతావరణం నచ్చక హైదరాబాద్ లో చిత్రజ్యోతి లో ఉద్యోగం దొరకడం తో అక్కడికి వెళ్లిపోయే దాదాపు పదమూడు సంవత్సరాలు పనిచేసారు. మళ్ళీ చాలా ఏళ్లకు గుణశేఖర్ గారి సినిమాతో మళ్ళీ ఇండస్ట్రీ లోకి వచ్చారు. ఇక చిత్రజ్యోతి వారపత్రికతో చిరంజీవి గారికి మంచి అనుబంధం ఉంది. ఆయన ఫోటో ప్రతి వారం మ్యాగజైన్ కవర్ ఫోటో గా వచ్చేది. అయితే ఒకసారి ఒక ఆల్కహాల్ కీ సంబందించిన కంపెనీ వాణిజ్య ప్రకటనతో సంవత్సరానికి ఒప్పందం చేసుకోవడం వల్ల కవర్ పేజీలో చిరంజీవిగారి ఫోటోతో పాటు ఆ ఆల్కహాల్ కీ సంబంధించిన వాణిజ్య ప్రకటన రావాల్సి రావడంతో చిరంజీవి గారికి బాగా కోపం వచ్చిందని ప్రసాద్ గారు తెలిపారు.
ఏడాది పాటు కవర్ పేజీ లో ఆయన ఫోటో లేదు…..
ఒక లిక్కర్ యాడ్ దగ్గర తన ఫోటో వస్తే తన అభిమానులు, జనాల్లో ఎటువంటి సందేశం వెళ్తుంది. ఒక హీరోని అనుసరించే అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారు అంటూ చిరు ఫైర్ అయ్యారట. చిత్రజ్యోతి యజమాని గారే స్వయంగా మాట్లాడినా చిరంజీవి గారు తన ఫోటోతో పాటు లిక్కర్ యాడ్ రావడానికి ససేమీరా ఒప్పుకోక పోవడంతో, ఇటు లిక్కర్ కంపెనీతో ఏడాదికి ఒప్పందం చేసుకోవడం వల్ల ఏడాది పాటు చిరంజీవి గారి ఫోటో లేకుండానే చిత్రజ్యోతి కవర్ పేజీ పబ్లిష్ చేశారట. అలా చిరంజీవి గారితో ఏర్పడిన చిన్న రప్చర్ గురించి ప్రసాద్ గారు ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.
Latest Videos :
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…