Writer Thota Prasad : తెలుగు సినిమా పరిశ్రమలో గోస్ట్ రైటర్ గా, రైటర్ గా డైలాగ్ రైటర్ గా ఇలా పలు సినిమాలకు తన రచన సహకారం అందించిన వ్యక్తి తోట ప్రసాద్ గారు. ఆయన చిత్రజ్యోతి సినీ పత్రిక కోసం పదమూడేళ్లు పనిచేసారు. అయితే మొదట సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆపైన అక్కడి వాతావరణం నచ్చక సినిమా పరిశ్రమకు అనుబంధంగా ఉంటున్న ప్రింట్ మీడియా కోసం చాలా ఏళ్ళు పనిచేసి ఆపైన ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ తో కూడా పనిచేసారు. విజయ బాపీనీడు గారి ద్వారా సినిమా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ప్రసాద్ గారు గుణశేఖర్, పూరి జగన్నాథ్, మెహర్ రమేష్ వంటి డైరెక్టర్స్ తో కలిసి పనిచేసారు. తాజాగా ఆయన యూట్యూబ్ ఛానెల్స్ కీ ఇచ్చిన ఇంటర్వ్యూ లలో అలనాటి విశేషాలను ఆయన జ్ఞాపకాలను పంచుకున్నారు.
నన్ను మోసం చేసారు….
రైటర్ గా ఆరంజ్, శక్తి, వరుడు వంటి డిజాస్టర్ సినిమాలకు పనిచేసి ఫెయిల్యూర్ అయినా కూడా తనకు ఇండస్ట్రీ లో మంచి పేరుందని ఇప్పటికి బన్నీ తన వద్దకు వచ్చే కథలను తనతో చర్చిస్తారంటూ చెప్పిన ప్రసాద్ గారు ఆరంజ్ సినిమా ఆ సమయానికి అడ్వాన్స్ కథ అవడం వల్లే ప్లాప్ అయిందని అయితే కథలో మార్పులు డైరెక్టర్ భాస్కర్ కు సూచించిన ఆయన కథను మార్చడానికి ఒప్పుకోలేదని చెప్పారు. అలా మార్చకపోవడం వల్లే సినిమా క్లాసిక్ గా మిగిలిందని చెప్పారు. ఇక కొన్ని సినిమాలకు పనిచేసిన క్రెడిట్ ఇవ్వకపోవడం వల్ల సిపివిడ్ కీ ముందు తాను సోలో రైటర్ గానే పనిచేయాలని నిర్ణయించుకుని కొన్ని సినిమాలకే పని ఒప్పుకున్నారట.
తన పెద్ద కూతురుకి పెళ్లి చేయాలనీ అనుకున్నపుడు ఒక కథ రాసుకుని కళ్యాణ్ రామ్ గారికి వినిపించగా నచ్చి చెందామని చెప్పారట. అయితే డైరెక్టర్ సరిగా కుదరక చేయలేక పోయారట. అయితే అదే డైరెక్టర్ వేరే హీరోతో డిజస్టర్ సినిమా తీసాడట. ఇక మరోసారి ఏకంగా ఒక డైరెక్టర్ తన కథను చోరీ చేశాడంటూ ప్రసాద్ గారు తెలిపారు. ఈ విషయం సినిమా ఇండస్ట్రీ సర్కిల్ లో చక్కర్లు కొట్టిన ప్రసాద్ గారి కథ రిజిస్టర్ అయినా కూడా ఆయన ఫిర్యాదు చేయలేదట. కేవలం కథ కోసం అడ్వాన్స్ తీసుకున్న నిర్మాత కు చెప్పి పక్కకు తప్పుకున్నారట. ఆ కథ రాసిన ఉదేశ్యం రెండో కూతురికి పెళ్లి చేయాలనీ అందుకే రాశారట.
కానీ ఆ దర్శకుడు కథను చోరీ చేయడం వల్ల 2018 లో జరగాల్సిన కూతురు పెళ్లి మళ్ళీ 2022 లో జరిగిందని సదరు డైరెక్టర్ వల్ల తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ చెప్పారు ప్రసాద్. ఇక తాజాగా అదే డైరెక్టర్ భారీ బడ్జెట్ సినిమా కూడా తాను అమ్ముకున్న కథలోని కొన్ని ఎపిసోడ్స్ తో తీస్తున్నట్లు తెలిసింది. అయితే సినిమా చూస్తే కానీ కాపీ చేసాడో లేదో క్లారిటీ గా చెప్పలేను ఒకవేళ కాపీ చేసుంటే ఆ దర్శక చోరుడు మీద కేసు వేస్తా అంటూ ప్రసాద్ గారు ఆసక్తికర విషయాలను తెలిపారు.
Latest Videos :
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…