Featured

యాచకుడి అంతిమయాత్రకు వేల మంది జనాలు.. ఎందుకో తెలుసా..?

కర్టాటకలోని బళ్లారిలో జరిగిన ఓ యాచకుడి అంతిమ యాత్రకు వేలాది జానాలు తరలివచ్చారు. ప్రస్తుతం అతడి యాత్రకు సంబంధించి వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. అతడికి కడసారి వీడ్కోలు పలికేందుకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

బళ్లారిలోని హడగలికి చెందిన బసవ అలియాస్ పుచ్చ భాత్స్య అనే యాచకుడితో అక్కడి వారికి ప్రత్యేక అనుబంధం ఉంది. బసవకు భిక్షం పెడితే మంచి జరుగుతుందని అక్కడి వారి నమ్మకం. అందుకే చాలామంది అతడిని పిలిచి మరీ అన్నదానం చేసేవారు. ఆయన ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. బసవ అంతిమయాత్రకు వేలాది మంది హాజరై తుది వీడ్కోలు పలికారు.

సాధారణంగా ప్రముఖులు మరణిస్తేనే అలాంటి జానల్ని మనం అంతిమయత్రలో చూస్తుంటాం. కానీ అక్కడ మాత్రం వేరేవిధంగా ఉంది. అయితే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే.. కొత్తగా ఆప్రాంతానికి వచ్చిన వారు ఇలా అంటున్నారు..‘‘అంతమంది అంతిమయత్రకు వచ్చారు.. ఎవరైనా ప్రముఖులు చనిపోయారా’’.. అంటూ పక్కవారిని అడగడం విశేషం.

కాదు అతడు ఒక యాచకుడు అని చెప్పగానే వాళ్లకు ఆశ్చర్యంతో పాటు.. అలా ఎలా అనే విషయాలను తెలుసుకోవాలనే ఉత్సుకత కూడా పెరిగింది. అయితే దీనిపై నటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అతడి దగ్గర ఏమైనా రూ.కోట్లు ఉన్నాయేమో అని చాలా మంది అనుకున్నారు కానీ.. అతడిపై ఉన్న మమకారం.. గౌరవం, నమ్మకంతోనే వాళ్లంతా అంతిమయాత్రకు వచ్చారు. ఏదేమైనా.. సొంత బంధువులు చనిపోతేనే అంతియ యాత్రకు పోలేని ఈ రోజుల్లో.. ఒక యాచకుడి అంతిమయాత్రకు అంతమంది వెళ్లడం అనేది చెప్పుకోదగిన విషయమే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago