Actress Anushaka: అనుష్క సోదరుడిపై హత్యకు ప్లాన్… భద్రత కల్పించాలంటూ హోం మంత్రికి వినతి!
Actress Anushaka: వెండితెర జేజమ్మగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుష్క శెట్టి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు పొందారు. ఈమె తెలుగు తమిళ భాషలలో స్టార్ హీరోలందరి సరసన నటించి అగ్రతారగా కొనసాగారు.బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన అనుష్క ప్రస్తుతం కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది.
ఇకపోతే అనుష్క సోదరుడు గుణ రంజన్ శెట్టి పై మాఫియా నేరగాళ్లు హత్యకు కుట్ర చేసినట్లు పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో మాఫియా నేరగాడు ముత్తప్పరై బతికున్నప్పుడు మన్విత్ రై, గుణరంజన్‌శెట్టిలు కుడి, ఎడమ భుజంలా ఉండేవారు. ఆయన మరణించిన తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. గుణ రంజన్ సొంతంగా జయ కర్ణాటక జనపర వేదికని స్థాపించారు.
ఈ నేపథ్యంలో మన్విత్ రై అసూయతో.. గుణ రంజన్ ని హత్య చేసేందుకు ముత్తరప్పై కుట్ర చేస్తున్నారని.. ఆయన అన్ని చర్యలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.అయితే ఈ విషయంపై స్పందించిన మన్విత్ తాను విదేశాలలో నివసిస్తున్నానని తనకు,ఈ కుట్రకు ఏ విధమైన సంబంధం లేదని తనపై ఇప్పటివరకు ఏ విధమైనటువంటి క్రిమినల్ కేసులు కూడా లేవని వాదించారు.
ఈ విధంగా తన పై హత్యకు కుట్ర జరుగుతుందని తెలియడంతో గుణ రంజన్ ఆదివారం రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్రను కలిసి గుణరంజన్‌కు భద్రత కల్పించాలంటూ వినతి పత్రం అందించారు. ఈ విధంగా అనుష్క సోదరుడు హత్యకు కుట్ర జరుగుతుందని తెలియడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ విషయంపై స్వీటీ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈమెకు గుణ రంజన్ తో రమేష్ శెట్టి అని మరొక సోదరుడు కూడా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…