Tillu Venu : సినిమాల్లో కమెడియన్ గా పరిచయమైన వేణు ఆ తరువాత జబర్దస్త్ లో వేణు వండర్స్ అంటూ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ లో వేసిన ఒక స్కిట్స్ వల్ల వివాదాలు వచ్చి ఆ తరువాత కొన్నిరోజులకి ఇక జబర్దస్త్ నుండి వెళ్ళిపోయాడు. జబర్దస్త్ నుండి వెళ్ళిపోయాక చాలా ఇబ్బందులు పడి, అవకాశాలు లేక ఆర్థికంగా బాగా నష్టపోయినట్లు యూట్యూబ్ లో వార్తలు కూడా వచ్చాయి. ఇక వీటిపై తాజాగా ఒక ఇంటర్వ్యూ లో వేణు స్పందించాడు.
సుధీర్ సహాయం అంతా ఫేక్…
జబర్దస్త్ నుండి వెళ్ళిపోయాక చాలా రోజులు అవకాశాలు లేక ఖాళీగా ఉన్నాడు వేణు. ఇక ఈ సమయంలోనే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే సుడిగాలి సుధీర్ 15 లక్షల ఆర్థిక సహాయం చేశాడంటూ యూట్యూబ్ లో వార్తలు వినిపించాయి. ఇక వీటిపై స్పందిస్తూ వేణు అవన్నీ ఫేక్ న్యూస్, నాకు సుధీర్ ఏం సహాయం చేయలేదు. అయినా నాకు అవకాశాలు లేకపోయినా ఇబ్బందులయితే పడలేదు. ఆర్థికంగా బాగానే ఉన్నాను, అలాగే డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉంటాను అందుకే ఎలాంటి ఇబ్బందులు రాలేదు అంటూ చెప్పాడు. ఇదే విషయం సుధీర్ కి కూడా చెప్పాను ఎలా 15 లక్షలు ఇచ్చావని వీడియో వచ్చింది. అంటే నాకు తెలియదన్నా అంటూ అన్నాడు. ఇక ఇంట్లో ఆ వీడియో వల్ల నా భార్య, నా అన్న కూడా నిజం చెప్పు తీసుకున్నావా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని నీలాదీశారు.
వీడియో వైరల్ అయితే అయింది డబ్బులు ఇచ్చుంటే బాగుండేది అంటూ సరదాగా అన్నాడు వేణు టిల్లు. ఇలాంటి ఫేక్ వీడియోలా వల్ల చాలా నష్టం జరుగుతుంది. కమెడియన్ సుమన్ శెట్టి చనిపోయాడని యూట్యూబ్ లో వచ్చింది. వాళ్ళ నాన్న చనిపోయి బాధలో ఉంటే ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతుంది. ఒకవేళ అలాంటి పరిస్థితి నాకే వచ్చినా నా గురించి అలాంటి ఒక వార్త యూట్యూబ్ లో వస్తే ఎనభై సవంత్సరాలు ఉన్న మా అమ్మ విని తట్టుకోగలదా, ఆవిడకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత తీసుకుంటారు అంటూ ఎమోషనల్ అయ్యారు. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ డబ్బులు సంపాదించడం కోసం చేయకండి అంటూ చెప్పాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…