Movie News

Time Travel Movies: బాలయ్య ఆదిత్య 369 నుంచి కళ్యాణ్ రామ్ బింబిసారా వరకు వచ్చిన టైం ట్రావెల్ సినిమాలివే?

Time Travel Movies: సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత ఎన్నో రకాల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. అయితే టైం ట్రావెల్ నేపథ్యంలో నిర్మించాలంటే భారీ బడ్జెట్ తో కూడుకోవడమే కాకుండా, స్క్రిప్ట్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో సినిమాలు టైం ట్రావెల్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.అయితే ఇలా టైం ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే…

ఆదిత్య 369: సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన టైం ట్రావెల్ చిత్రం ఆదిత్య 369. ఈ సినిమా ద్వారా శ్రీకృష్ణదేవరాయల కాలంతో పాటు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా చూపించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఫన్ 2 ఇష్: పరేష్ రావల్ ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమాలో అందులో పాత్రలో వేరే కాలానికి వెళతాయి. ఈ సినిమా ఓ మోస్తరు విజయాన్ని సొంతం చేసుకుంది.

లవ్ స్టోరీ 2050: 2008లో తెరకెక్కిన ఈ సినిమా 2050 టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా కూడా పరవాలేదనిపించుకుంది.

యాక్షన్ రిప్లై: అక్షయ్ కుమార్ ఐశ్వర్యరాయ్ జంటగా నటించిన ఈ సినిమా కూడా టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా కూడా మోస్తారు విజయాన్ని సొంతం చేసుకుంది.

బార్ బార్ దేఖో: సిద్ధార్థ మల్హోత్రా కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ చిత్రం కూడా టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాతో పాటు విష్ణు విశాల్ ఇండ్రు నేట్రు నాలై, శ్రీ, సూర్య 24, తేజ సర్జ,శివాని రాజశేఖర్ జంటగా నటించిన అద్భుతం సినిమా కూడా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కింది.

Time Travel Movies: భారీ బడ్జెట్ చిత్రాలు…

బింబిసారా: తాజాగా కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా సినిమా కూడా టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుందని చెప్పాలి. ఇలా ఈ సినిమాలన్నీ కూడా టైం ట్రావెల్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినవే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago