Categories: FeaturedGeneral News

నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం.. ఓ రోజు రాత్రి ఆమె పడుకున్న సమయంలో..!

పెళ్లి అనే బంధానికి మచ్చతెస్తున్నారు కొంతమంది. వివాహేతర సంబంధాలు పెట్టుకొని క‌ట్టుకున్న భర్త లేదా భార్యను ఒక‌రికి ఒక‌రు ద్రోహం చేసుకుంటున్నారు. వారిపై ఆధారపడిన పిల్లలకు, కుటుంబసభ్యుల కన్నీటికి కారణమవుతున్నారు. తాత్కాలిక సుఖాలు, ఆకర్షణల మాయలో పడి అందమైన కుటుంబాలను దూరం చేసుకుంటున్నారు. వివాహేత‌ర సంబంధాల మోజులో ప‌డి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలా ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భార్యను, కన్నపిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్లింది ఓ భార్య. చివరకు చూస్తే అతడి చేతిలోనే బలైపోయిది.

ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కడప నగరంలోని దేవుని కడప ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇదే ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల యశోద అనే మహిళకు 10 ఏళ్ల క్రితం జయశంకర్ అనే వ్యక్తితో వివాహం అయింది. వారికి ఇద్దరు పిల్లలు. అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో యశోదకు నిత్యపూజయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త మందలించాడు. దీంతో రోజు ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. దీంతో ఓ రోజు ఇంటి నుంచి ప్రియుడితో వెళ్లిపోయింది యశోద.

ఇలా నాలుగేళ్లుగా అతడితో సహజీవనం చేసింది. పెళ్లి చేసుకోవాలని యశోద అతడిని అడిగింది. అతడికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దీంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఓ రోజు రాత్రి ఆమె పడుకున్న సమయంలో దిండు తీసుకొని ఆమె ముఖంపై పెట్టి హత్య చేశాడు. అనంతరం ఆ ఇంటికి తాళం వేసి పారిపోయాడు. .

యశోద చెల్లి సాయంత్రం ఎంత ఫోన్ చేసినా లిప్ట్ చేయకపోవడంతో భయపడి ఆమె ఇంటికి వెళ్లి స్థానికుల సాయంతో తలుపులు పగులగొట్టి చూడగా ఆమె అచేతనంగా పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న యువకుడి కోసం గాలిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago