పెళ్లి అనే బంధానికి మచ్చతెస్తున్నారు కొంతమంది. వివాహేతర సంబంధాలు పెట్టుకొని కట్టుకున్న భర్త లేదా భార్యను ఒకరికి ఒకరు ద్రోహం చేసుకుంటున్నారు. వారిపై ఆధారపడిన పిల్లలకు, కుటుంబసభ్యుల కన్నీటికి కారణమవుతున్నారు. తాత్కాలిక సుఖాలు, ఆకర్షణల మాయలో పడి అందమైన కుటుంబాలను దూరం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాల మోజులో పడి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలా ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భార్యను, కన్నపిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్లింది ఓ భార్య. చివరకు చూస్తే అతడి చేతిలోనే బలైపోయిది.

ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కడప నగరంలోని దేవుని కడప ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇదే ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల యశోద అనే మహిళకు 10 ఏళ్ల క్రితం జయశంకర్ అనే వ్యక్తితో వివాహం అయింది. వారికి ఇద్దరు పిల్లలు. అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో యశోదకు నిత్యపూజయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త మందలించాడు. దీంతో రోజు ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. దీంతో ఓ రోజు ఇంటి నుంచి ప్రియుడితో వెళ్లిపోయింది యశోద.
ఇలా నాలుగేళ్లుగా అతడితో సహజీవనం చేసింది. పెళ్లి చేసుకోవాలని యశోద అతడిని అడిగింది. అతడికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దీంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఓ రోజు రాత్రి ఆమె పడుకున్న సమయంలో దిండు తీసుకొని ఆమె ముఖంపై పెట్టి హత్య చేశాడు. అనంతరం ఆ ఇంటికి తాళం వేసి పారిపోయాడు. .
యశోద చెల్లి సాయంత్రం ఎంత ఫోన్ చేసినా లిప్ట్ చేయకపోవడంతో భయపడి ఆమె ఇంటికి వెళ్లి స్థానికుల సాయంతో తలుపులు పగులగొట్టి చూడగా ఆమె అచేతనంగా పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న యువకుడి కోసం గాలిస్తున్నారు.






























