Featured

రాజశేఖర్ సినిమాలో బాలనటిగా కనిపించి ఆ తర్వాత ఆయనతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా.?!

డాక్టర్ కాబోయి యాక్టర్ అయినా హీరో రాజశేఖర్. తల్లిదండ్రుల కోరిక మేరకు చెన్నై లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. త్వరలో స్టెతస్కోప్ పట్టుకోబోయి.. హఠాత్తుగా సినిమా కెమెరాముందుకు వచ్చారు. చదువుకునే రోజుల్లో తన స్నేహితులు అందంగా ఉన్నావు సినిమాల్లో చేరమని చెప్పారు. అలా స్నేహితులు ఇచ్చిన సలహా.. మరియు సినిమాల్లో అనుకోకుండా అవకాశం రావడంతో సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు.

1985లో “వందేమాతరం” సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇక అప్పటి నుంచి ప్రతిఘటన, అరుణ కిరణం, శృతిలయలు, తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, మగాడు, అహంకారి, ఆగ్రహం, రాజసింహం, శిలాశాసనం, అల్లరి ప్రియుడు, మొరటోడు నా మొగుడు, ఎవడైతే నాకేంటి, భరత సింహారెడ్డి, గరుడవేగ, కల్కి లాంటి చిత్రాల్లో ఆయన నటించారు.

అంకుశం మగాడు వంటి చిత్రాల్లో.. యాంగ్రీ యంగ్ మెన్ గా కనిపించిన రాజశేఖర్, లవర్ బాయ్ గా అల్లరి ప్రియుడు చిత్రంలో కనిపించారు. జీవితతో అనేక చిత్రాల్లో కలిసి నటించిన రాజశేఖర్ ఆమెను 1991లో వివాహం చేసుకున్నారు. వీరికి శివానీ, శివాత్మిక అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. రెండవ కూతురు శివాత్మిక విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో “దొరసాని” చిత్రంలో నటించారు.

1989లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో “మమతల కోవెల” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో రాజశేఖర్, సుహాసిని హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇందులో రాజశేఖర్ కూతురుగా రాశి బాలనటిగా కనిపించారు. దాదాపు పది సంవత్సరాల తర్వాత రాశి తిరిగి రాజశేఖర్ తో ఒక సినిమాలో హీరోయిన్ గా నటించారు. 1999, ఆర్.బి.చౌదరి నిర్మాణం,ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో “నేటి గాంధీ” సినిమా విడుదలయ్యింది.

ఇందులో హీరో, హీరోయిన్లుగా రాజశేఖర్, రాశి నటించారు. ఒకప్పుడు రాజశేఖర్ తో “మమతల కోవెల” చిత్రంలో బాలనటిగా కనిపించిన రాశి తిరిగి ఆయనతో నేటి గాంధీ చిత్రంలో హీరోయిన్ గా నటించారు. జగపతిబాబు హీరోగా వచ్చిన “శుభాకాంక్షలు” చిత్రంలో రాశి మొదటిసారిగా హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాత శ్రీకాంత్, బాలకృష్ణ, రాజశేఖర్, పవన్ కళ్యాణ్, వెంకటేష్ లాంటి హీరోలతో నటించి అనతికాలంలోనే రాశి ఎంతో పేరు తెచ్చుకున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago