Featured

‘మిస్ యూ నాన్న’ అంటూ స్టేజ్ పైన ఎమోషనల్ అయిన టీఎన్ఆర్ కుమారుడు!

ప్రముఖ జర్నలిస్ట్, సినీ పరిశ్రమ కు చెందిన టీఎన్ఆర్ (TNR) గత మే నెలలో కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు వదిలారు. అతను యాంకర్ గా చేస్తూ ఇంటర్వ్యూలను నిర్వహించేవారు. అతడు చేసే ప్రతీ ఇంటర్వ్యూలో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయన ఎంతో మంది అభిమానులకు కూడా సంపాదించారు. మొదటి నుంచి ఆయనకు దర్శకుడు కావాలనే కల ఉండేది. కానీ అది నెరవేరలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడి కుమారుడు తనతండ్రి గురించి ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

చిరంజీవి హీరోగా నటించి ముగ్గురు మొనగాళ్లు సినిమా అంటే తన నాన్నకు ఎంతో ఇష్టమని.. అందరం కలిసి ఆ సినిమాను చూసే వాళ్లం అని చెబుతూ కన్నీరు పెట్టుకున్నాడు. ‘మిస్ యూ నాన్న’ అంటూ అతడు కంటతడిపెట్టాడు. టీఎన్ఆర్ యాంకర్ గాను సినిమాలోని తన నటనతో ఎంతో ప్రాముఖ్యతను సంపాదించాడు.

అతడు సినీ నటులతో చేసిన ఇంటర్వ్యూలు యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ వచ్చేవి. నటుడిగా ఎక్కువ రెమ్యూనరేషన్ ఆశించేవాడు కాదు. ఇలా అకాలమరణం చెందడంతో ఎంతో మంది అభిమానులకు దిగ్భ్రాంతికి గురిచేసింది. అందరితో కలిసిమెలిసి పోయే మనస్తత్వం మరియు ముక్కుసూటితనం అతడిని చాలామందికి దగ్గరకు చేర్చింది.

సినీ పరిశ్రమలో ఒకసహాయ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దగ్గుపాటి రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా, ఫలక్ నుమా దాస్, జార్జ్ రెడ్డి, సవారీ, HIT, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య, సుబ్రహ్మణ్యపురం, జాతి రత్నాలు వంటి చిత్రాలలో చిరస్మరణీయమైన నటనను అందించిన ప్రముఖ తెలుగు నటుడు టీఎన్ఆర్.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

11 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

12 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

13 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

13 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

14 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

14 hours ago