Year Ender 2023: సాధారణంగా ఒక భాషలో ఎంతో మచ్చి సక్సెస్ అయినటువంటి సినిమాలు మరొక భాషలో ప్రేక్షకుల ముందుకు రావడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో రీమేక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ రీమేక్ సినిమాలు భారీ స్థాయిలో డిజాస్టర్ అయ్యాయని తెలుస్తుంది.
మరి ఈ ఏడాది రీమేక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ ఎదుర్కొన్నటువంటి హీరోలు ఎవరు ఆ సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే… పవన్ కళ్యాణ్ సాయి వరుణ్ తేజ్ హీరోలుగా నటించినటువంటి బ్రో సినిమా వినోదయ సిత్తం అనే సినిమాకు రీమేక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన భారీ డిజాస్టర్ గా నిలిచింది.
ఇక చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా కూడా 2015వ సంవత్సరంలో తమిళంలో వేదాళం సినిమాకు రీమేక్ సినిమాగా ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా భారీ డిజాస్టర్ ఎదుర్కొంది. రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమా బెంగాలీ థ్రిల్లర్ విన్సి దా అనే చిత్రానికి రీమేక్. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు.
సక్సెస్ అందుకోలేని రీమేక్ సినిమాలు…
రవితేజ నెగిటివ్ షేడ్స్ తో కూడిన రోల్ చేశారు. రావణాసుర సినిమా కూడా ప్రేక్షకులను తీవ్ర నిరాశపరిచింది. ఈ సినిమాతో పాటు రవితేజ ఇటీవల టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా నిరాశపరిచింది ఇలా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి రీమేక్ సినిమాలన్నీ కూడా ఎంతో నిరాశపరిచాయని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…