Shivaji: బిగ్ బాస్ కార్యక్రమంలో హీరో శివాజీ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయన హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి పలు విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ విజేత శివాజీ అంటూ మొదటి నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. ఇలా శివాజీ మొదటి నుంచి కూడా టైటిల్ రేసులో ఉన్నారు కానీ గత రెండు వారాలుగా ఈయన ఓటింగ్ లో కాస్త వెనుకబడ్డారని తెలుస్తుంది.
ఇప్పటికే బిగ్ బాస్ కార్యక్రమం 14 వారాలను పూర్తి చేసుకుంది. మరొక మూడు రోజులలో ఈ కార్యక్రమం విన్నర్ ఎవరు అనే విషయాలను ప్రకటించబోతున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో తప్పకుండా శివాజీ గెలవాలి అంటూ అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయటం విశేషం. శివాజీ బిగ్ బాస్ విన్నర్ గా నిలవాలి అంటూ ఆయన అభిమానులు అనాధలకు పెద్ద ఎత్తున అన్నదానం చేస్తున్నారు.
బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్నటువంటి శివాజీ తప్పకుండా ఈ సీజన్ విన్నర్ కావాలని కోరుకుంటూ అభిమానులు ఇలా అనాధలకు పేదవారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి వీడియోలు శివాజీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు అనే విషయాలు మాత్రం తెలియడం లేదు.
కడుపు నింపిన అభిమానులు..
ఈ ఫోటోలు వీడియోలు వైరల్ గా మారడంతో ఎంతోమంది శివాజీ గెలిచే విషయం పక్కన పెడితే ఆయన గెలవాలి అంటూ ఎంతో మంది అనాధలకు కడుపునిండా భోజనం పెట్టడం నిజంగా ప్రశంసించ దగ్గ విషయం అంటూ అభిమానులపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి బిగ్ బాస్ విన్నర్ గా శివాజీ కప్పు గెలుస్తారా లేక పల్లవి ప్రశాంత్, అమర్ వీరిద్దరిలో ఎవరో ఒకరు కప్పు గెలుచుకుంటారా అనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…