Categories: FeaturedMovie News

నడిరోడ్డుపై ఓ ఆకతాయి వేదించాడు.. – సంచలనం సృష్టిస్తున్న హీరోయిన్ రెజీనా కామెంట్స్ !!

బాలీవుడ్ నుండి హాలీవుడ్ దాకా సినీరంగంలో కాస్టింగ్ కౌచ్ ఉంద‌ంటూ శ్రీరెడ్డి, గాయత్రి గుప్తా, తనుశ్రీ దత్తా, మాధవీలత వంటి గ్లామర్ హీరోయిన్లు కొందరు మీడియా ముందుకొచ్చి సినీ ఇండ్రస్ట్రీలో తెర చాటున జరుగుతున్న భాగోతాలను బట్టబయలు చేస్తూ.. ఇండ్రస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే..! తాజాగా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ వుందని తేల్చి చెప్పింది అందాల తార రెజీనా. ‘మిస్టర్ చంద్రమౌళి’ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా ఇండియా గ్లిడ్జ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి రెజీనా మాట్లాడుతూ…

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన క్రొత్తలో త‌ను కూడా అనేక వేధింపుల‌కు గురయ్యానని, కొందరు సినీ ప్రముఖులు తమ వాంఛలను తీర్చాల‌ని కోరారనీ, తను మాత్రం ఎవ్వరికీ లొంగలేదని, కాస్టింగ్ కౌచ్ అనేది సినీ రంగంలో కామన్ అని తేల్చి చెప్పేసింది. ఇందుకు ఉదాహరణగా తన పర్సనల్ లైఫ్ లో జరిగిన ఓ సంఘటనను వివరిస్తూ.. ఈమధ్య ఓ పబ్లిక్ ఫంక్షన్ కు వెళ్లినప్పుడు ఓ ఆకతాయి తనని తాకరాని చోట తాకి తీవ్రమైన మనోవేదనకు గురి చేసాడని మనోవేదనను వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సినీ రంగంలోకి వచ్చిన అమ్మాయిలు అలాంటివారి నుంచి ఎలా తప్పించుకోవాలో కొన్ని తెలివైన చిట్కాలను కూడా వివరించింది. గతంలో తాను చాలా వీక్‌గా సున్నితంగా ఉండేదాన్ని అని.. సినీరంగంలో తనకెదురైన చేదు అనుభవాల దృష్ట్యా ప్రస్తుతం తాను చాలా టఫ్‌గా తయారయ్యానని ఎలాంటి బాధలనైన భరించేంత స్ట్రాంగ్ గా తయారయ్యానని చెప్పుకొచ్చింది.

తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీ లోనూ సూపర్‌ హిట్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ తాజాగా తను ఎదుర్కొన్న వేదింపుల సంఘటనలను వివరించేసరికి ఒక్కసారిగా సోషల్ మీడియా కూడా షేకయ్యింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago