అల్లు అర్జున్.. ఫ్యాన్స్ అందరూ బన్నీ, స్టైలిష్ స్టార్ అంటూ మురిసిపోయే మన మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్, 8 Apr 1983 అల్లు అరవింద్ మరియు శ్రీమతి నిర్మల దంపతులకు మద్రాసు లో జన్మించారు. అల్లు అర్జున్ చదువు పూర్తైన తర్వాత యానిమేషన్ కోర్స్ కూడా పూర్తిచేసి కెనడాలో ఉన్నత చదువులు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మెగాస్టార్ ‘డాడీ’ సినిమాలో ప్రత్యెక పాత్రలో నటించే అవకాశమొచ్చింది. ఆ తరవాత వచ్చిన ‘గంగోత్రి’ చిత్రంలో హీరోగా నటించి పూర్తిస్థాయి నటుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు.
హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడిగా, టాలీవుడ్ లోనే పెద్ద నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కుమారుడిగా, మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా అల్లు అర్జున్ టాలీవుడ్ ఎంట్రీ సునాయాసంగానే జరిగింది, కానీ దానిని సద్వినియోగం చేసుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ను ఏర్పరచుకోవటంలో అల్లు అర్జున్ చేసిన కృషిని అభినందించాల్సిందే. గంగోత్రి తరవాత ‘ఫీల్ మై లవ్’ అంటూ ఓ వైవిధ్యమైన ప్రేమికుడి పాత్రలో ‘ఆర్య’ గా యువతరం హృదయాలను దోచుకున్నాడు. ఆర్య చిత్రంతో ఒక్క తెలుగులోనే కాకుండా మలయాళ, కన్నడ ప్రేక్షకుల ప్రశంసలను కూడా అందుకున్నాడు. నేటికీ మలయాళంలో అల్లు అర్జున్ సినిమాలన్నీ డబ్ అయ్యి విడుదలై బన్నీకి అక్కడ పిచ్చా ఫ్యాన్స్ ఫాలోయింగ్ వుండటం విశేషం. ఆర్య తరవాత విడుదలైన ‘బన్నీ’ చిత్రం సూపర్ హిట్ సాధించడంతో మన స్టైలిష్ స్టార్ కాస్తా కమర్షియల్ హీరోగా స్థిరపడ్డాడు. అప్పట్నుంచి బన్నీ తాను నటించిన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ప్రత్యేకతను చూపిస్తూ నటనలోనూ, డాన్సులోనూ తనకంటూ ఓ ప్రత్యేమైన స్టైల్ తో ప్రేక్షకులను అలరించాడు.
‘పరుగు’ లో కృష్ణ గా చక్కని నటనతో అందర్నీ ఆకట్టుకుని, ‘వేదం’ తో టాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రాల సంస్కృతికి తెరతీశాడు. అక్కడితో ఆగకుండా అంతే కాకుండా ఎవరో బాలీవుడ్ లోని అగ్రహీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా టాలీవుడ్ కు సిక్స్ ప్యాక్ బాడీ కల్చర్ ను పరిచయం చేసిన ఘనత కేవలం ఒక్క అల్లుఅర్జున్ కే దక్కుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ప్రస్తుత విషయానికొస్తే.. మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ ను తీసుకోవడమే కాకుండా.. ఆ సినిమా లాభాల్లో పాతిక శాతం వాటా కూడా తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఈ రూమర్స్ ఎంతవరకూ నిజమా అని ఆరా తీస్తే..
గత సంక్రాంతి సందర్భంగా విడుదలైన ’ అల వైకుంఠపురములో ‘ సినిమా అఖండ విజయం సాధించడంతో అల్లు అర్జున్ అమాంతం తన రెమ్యునరేషన్ పెంచినట్టు, అంతేకాకుండా బన్నీకి మన తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా భారీ ఎత్తున ఫ్యాన్స్ వుండటంతో సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ’పుష్ప‘తో బన్నీ హిందీ, తమిళ మార్కెట్లపై కూడా దృష్టి సారించి, ’అల వైకుంఠపురములో…‘ సినిమాకు రూ.25 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో పాతిక శాతం వాటా తీసుకున్న బన్నీ తాజాగా ’పుష్ప‘ సినిమా కోసం రూ.35 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో పాతిక శాతం అడుగుతున్నాడని తెలిసింది. ఇదిలావుండగా మరోప్రక్క ప్రస్తుతం కరోనా మహమ్మారి భయంతో షూటింగులు అంతంత మాత్రంగానే జరుగుతున్న నేపథ్యంలో బడ్జెట్ విషయంలో ’పుష్ప‘ నిర్మాతలు తర్జనభర్జన పడుతుండటంతో బన్నీ తన రెమ్యునరేషన్ పెంచే అవకాశాలు కనిపించడం లేదని టాలీవుడ్ లోని కొందరు ప్రముఖులు చెబుతున్నారు. ఈ 2 వాదనలలో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియాలంటే మరికొన్ని రోజులు నిరీక్షించాల్సిందే..!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…