Movie News

మంచు మనోజ్ తో గొడవలు.. అతడు వేరుగా ఉంటాడంటూ మంచు విష్ణు క్లారిటీ..

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఉన్న హోదా గురించి అందరికీ తెలిసిందే. డైలాగ్ కింగ్ మోహన్ బాబే కాకుండా తన వారసులను కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అంతేకాకుండా వారికి ఓ మంచి గుర్తింపును అందించాడు. ఇక మంచు ఫ్యామిలీ నుండి మంచు లక్ష్మి తొలి హీరోయిన్ గా పరిచయం కాగా మనోజ్, విష్ణు లు కూడా హీరోలుగా పరిచయమయ్యారు. ఇక మంచు లక్ష్మి ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలవలేకపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే మంచు మనోజ్ గురించి షాకింగ్ కామెంట్ చేశాడు విష్ణు.

ఇక ఈ కుటుంబం ఏదో ఒక విషయంలో నెట్టింట్లో బాగా వైరల్ గా మారుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా విష్ణు చేసిన కామెంట్స్ కూడా బాగా వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న రియాలిటీ షో ఆలీతో సరదాగా గురించి అందరికీ తెలిసిందే. ఇందులో ఆలీ హోస్టింగ్ చేయగా.. తాజాగా ఈ షోకు మంచు విష్ణు గెస్ట్ గా పాల్గొన్నాడు. ఇక తన వ్యక్తిగత విషయాల గురించి బాగా పంచుకున్నాడు విష్ణు. ఆలీ అడిగిన ప్రశ్నలకు తెగ సమాధానాలు చెప్పాడు.

ఇక తన తమ్ముడు మంచు మనోజ్ గురించి ఓ విషయాన్ని నేరుగా అడిగాడు ఆలీ. మీ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయంటూ.. అసలు మీ ఇద్దరికీ దేని వల్ల గొడవలు వచ్చింది.. అసలేం జరిగింది అని ప్రశ్నించాడు. ఇక ఈ ప్రశ్నకు మంచు విష్ణు వెంటనే సీరియస్ అయినట్లు కనిపించాడు. తను వేసుకున్న కోటును విప్పేస్తూ మా పర్సనల్ విషయాలు వాళ్లకి ఎందుకు అంటూ మండిపడ్డాడు.

మా మధ్య ఎటువంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చాడు. నేను, మా అక్క, మా తమ్ముడు వేరుగా ఉంటున్నాం తప్ప మా మధ్య ఎటువంటి గొడవలు లేవని.. ఎటువంటి పుకార్లకు సమాధానం చెప్పను అంటూ తెలిపాడు విష్ణు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

1 month ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

1 month ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

1 month ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

1 month ago