Jhansi: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ యాంకర్ ఝాన్సీ ఒకరు. ఈమె ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఒకానొక సమయంలో వరుస బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఝాన్సీ ప్రస్తుతం యాంకరింగ్ కు దూరం అయ్యారు.
ఇలా యాంకర్ గా బుల్లితెరకు వస్తే చెప్పినటువంటి ఈమె వెండితెరపై మాత్రం వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఎన్నో విభిన్నమైనటువంటి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి ఝాన్సీ తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఒక వీడియో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా ఈమె రోడ్డుపై ఉన్నటువంటి చెత్తను మొత్తం ఏరుకొని తన కారులో వేసుకుంటూ కనిపించారు.
ఈ సందర్భంగా ఝాన్సీ ఈ చెత్తను ఏరుకోవడం గురించి నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే చెత్త ఏరుకోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. సాధారణంగా ప్రకృతి నుంచి లభించిన ఏ వస్తువు పాడైన తిరిగి అది ప్రకృతికి ఎంతో ఉపయోగపడుతుంది అనే సంగతి మనకు తెలిసిందే.
బూడిద చేయకండి…
ఈ క్రమంలోనే ఈమె రోడ్డు పక్కన ఎండిపోయిన గడ్డి ఆకులను ఏరుకుంటున్నారు.ఇక ఈ విషయం గురించి ఈమె సోషల్ మీడియాలో స్పందిస్తూ ఎండిపోయిన ఆకులు గడ్డిని కాల్చి బూడిద చేయకండి.అవి మన మట్టికి చాలా ఉపయోగపడతాయి. అవి ప్రకృతి సమతౌల్య సూత్రం అంటూ పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో ఈమెపై నేటిజన్స్ ప్రశంసల కురిపిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…