Trisha: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి త్రిష ఒకరు. ఈమె ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. అయితే ఈమెకు క్రమక్రమంగా అవకాశాలు తగ్గిపోవడంతో కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం హీరోయిన్గా అవకాశాలు అందుకుంటూ బిజీ అయ్యారు.
ఈ విధంగా ఇన్ని రోజులపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి త్రిష ఇప్పుడిప్పుడే తమిళ తెలుగు భాష చిత్రాలలో నటిస్తూ హీరోయిన్గా అవకాశాలను అందుకుంటు ఉన్నారు. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఈమె భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె తమిళంలో పలువురు స్టార్ హీరోలతో నటిస్తున్నారు. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా త్రిషకు సంబంధించినటువంటి ఒక వార్త కోలీవుడ్ ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతుంది. ఈమె తన ఫస్ట్ ఇన్నింగ్స్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి సమయంలో ఓ కోలీవుడ్ స్టార్ హీరోతో నటించే అవకాశం వచ్చిందట అయితే ఆ హీరోకి త్రిషతో కలిసి సినిమా చేయటం ఇష్టం లేదు. ఆయన ఆ సినిమాలో మరొక హీరోయిన్ నటించాలని కోరుకున్నారట.
సినిమా నుంచి తప్పుకోవడం…
ఇలా ఆయన అనుకున్నటువంటి హీరోయిన్ నటించాలి అంటే త్రిష ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. దీంతో త్రిషకు ఆయన భారీ ఆఫర్ ఇచ్చారని తెలుస్తుంది. ఈ సినిమా నుంచి మీరు తప్పుకుంటే ఐదు కోట్ల రూపాయలు ఇస్తానంటూ ఆమెకు భారీ ఆఫర్ ఇచ్చారట దీంతో త్రిష సినిమా చేయకుండానే ఐదు కోట్లు రావడం అంటే మామూలు విషయం కాదు అని భావించి ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. అయితే ఈ సినిమా నుంచి తప్పుకొని తప్పు చేశారని ఈ సినిమాలో వేరే హీరోయిన్ నటించి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారని చెప్పాలి. ఏది ఏమైనా సినిమా నుంచి తప్పుకొని ఈమె ఐదు కోట్లు పొందారనే విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…
తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…
హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…
సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…
ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…
ఇప్పటివరకు గర్భనిరోధక బాధ్యత ఎక్కువగా మహిళలపైనే ఉండేది. మాత్రలు, ఇతర పద్ధతులు ఎక్కువగా మహిళలకే పరిమితమయ్యాయి. అయితే వైద్యరంగంలో తాజా…