తెలుగు తెరపై ‘నచ్చావులే’, ‘స్నేహితుడా’ వంటి చిత్రాల్లో నటించి మాధవీలత మంచి గుర్తింపునే సంపాదించుకుంది. సినిమాల నుంచి సడన్ గా రాజకీయ రంగంవైపు దృష్టి సారించిన మాధవీలత ప్రజలకు సేవ చేయాలనే సదాలోచనతో బీజేపీ పార్టీలో చేరింది.
ఆమధ్య ఓ మీడియా ఇంటర్వ్యూ లో సినీ నటి మాధవీ లత మాట్లాడుతూ.. “ఓసారి పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ చూశాను. ఆయనకు సమాజంపై ఉన్న అవగాహన నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ ఇంటర్వ్యూ తర్వాతే పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ అయిపోయాను. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిన నేను జనసేనలో ఎందుకు చేరలేదని కొందరు ఫ్రెండ్స్ నన్ను అడిగారు. అసలు నేను బీజేపీలో చేరింది పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకునే అని చాలా మంది కామెంట్స్ చేశారు. కానీ, కామన్ సెన్స్ ఉన్నవారెవరూ అలా మాట్లాడరు. బీజేపీలో నేను చేరే టైంకి జనసేనకు బీజేపీ మధ్య ఎలాంటి పొత్తు లేదు. అలాంటప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నీ.. నాకు సీటు ఇవ్వండి అంటే ఇస్తారా? అని ప్రశ్నిస్తూనే.. మరోవైపు తానింతిలా పవన్ కోసం శ్రమిస్తున్న సరే పవన్ కళ్యాణ్ నుండి ఏమాత్రం స్పందన లేకపోవడంతో “మీ నిజమైన ఫాన్స్ కు కాకుండా ఏదో స్వ ప్రయోజనాలను మీ నుండి ఆశించి మీకు బర్త్ డే విషెస్ తెలిపినవారికే మీరు రిప్లై ఇస్తారా.? పోయిన సంవత్సరం మీరు ఎన్నికలో పోటీచేస్తుంటే మీకు ఓటేయమని ఒక్కరైనా పోస్ట్ పెట్టారా.? కనీసం జనసేన పార్టీకి మద్దతుగా మాట్లాడారా.? స్వార్ధ ప్రయోజనాల కోసమే మీకు కొందరు బర్త్ డే విషెష్ చెప్పారు.
వీలైతే మీకోసం నిజంగా పనిచేసిన జనసైనికులకి ధన్యవాదాలు తెలియజేయండి. అలాగే టాలీవుడ్ లో చాలా చెత్త పేరుకుపోయి ఉంది. ముందు దానిని ప్రక్షాళన చేయండి. ఆ తర్వాత ప్రజల గురించి ఆలోచిద్దురు గాని.. టాలీవుడ్ లో ముఖ్యంగా డ్రగ్స్, అమ్మాయిలపై లైంగిక వేధింపులు వంటి వెలుగులోకి రాని సమస్యలున్నాయి. వీలైతే వాటిపై పోరాడండి. డ్రగ్స్ లేని భారత్ కోసం కృషి చేయండి.” అంటూ పవన్ పై ఫైర్ అయ్యింది మాధవీలత. అయితే పవన్ కళ్యాణ్ అంటే మొదటి నుండి వీర విధేయత ప్రదర్శించే మాధవీలత.. నాకు స్క్రీన్ పై తప్ప నిజ జీవితంలో నటించడం రాదు. నేనింతే.. నా పోస్ట్ లు ఇంతే.. అంటూ పవన్‌ని ఉద్దేశించి చెప్పిన మాధవీలత.. నేనేం కడుపు మంటతో ఇలా మాట్లాడటం లేదంటూ ఆ తర్వాత క్లారిటీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి మాధవీలత అలా అందంటే.. ఆయనకు దగ్గరయ్యే విధంగానే ఉంటుంది. కాని ఈసారి కాస్త ఘాటుగా స్పందించడం పట్ల జనసైనికులు రియాక్ట్ అయ్యారు. కొంతమంది మాధవీలతను సపోర్ట్ చేస్తుంటే.. ఎప్పటిలాగే మరికొంత మంది తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అయితే ఒక జనసైనికుడు స్పందిస్తూ.. ‘ఓడినప్పుడు నేను ఓడిపోయాను అని చెప్పడానికి సిగ్గు పడకండి… కాని ఓడిన వ్యక్తి దగ్గర అంతులేని అనుభవం ఉంటుంది. ఆ అనుభవం అంకెల్లో చెప్పలేని అవకాశాలను చూపిస్తుంది. ఆ అనుభవం ఆకాశమంత ఎత్తుకు ఎదిగేలా చేస్తుంది.. వదినమ్మా ఐ యామ్ విత్ యు’ అంటూ కామెంట్ చేశాడు. అయితే వదినమ్మ అనే కామెంట్స్ పై మాధవీలత స్పందిస్తూ.. ‘మీకు దండం నాయనా.. వదిన ఏంటి.? అక్క అనండి. మీకు పవన్ కళ్యాణ్ అన్నయైనా నేను మాత్రం అక్కనే’ అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక మాధవీలత ఎప్పుడు పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి పోస్ట్ పెట్టినా… నాలుగో భార్య అని.. ఇంకేదో ఉందంటూ రకరకాల పిచ్చి కామెంట్లు వస్తూనే ఉంటాయి. వీటిపై కూడా తరచూ మాధవీలత ఘాటుగా రియాక్ట్ అవుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆయన చేసుకుంటానన్నా నాకు ఇంట్రస్ట్ లేదని గతంలో కూడా తేల్చి చెప్పేసింది మాధవీలత.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…