Categories: FeaturedMovie News

నిజంగానే జయ ప్రకాష్ రెడ్డి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందా.?

ప్రముఖ టాలీవుడ్ నటుడు, కమెడియన్ కమ్ విలన్ జయప్రకాశ్ రెడ్డి మరణవార్తతో టాలీవుడ్‌లో విషాదం అలుముకుంది. జయప్రకాష్ రెడ్డి ఇక లేరని తెలిసి షాకైంది సినీ లోకం. గుంటూరులోని కొరిటపాడు శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ఆయన కుమారుడు చంద్రప్రకాశ్ రెడ్డి అంత్యక్రియలను నిర్వహించారు.

జయప్రకాశ్ రెడ్డి గుండెపోటుతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయారు. హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే ఆయన మరణానికి టాలీవుడ్ మాత్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా సంతాపం ప్రకటించారు. అయితే టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ గొప్ప మనస్సు చాటుకున్నారు. ఆయన జయ ప్రకాష్ కుటుంబానికి 10 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందించారని తాజా సమాచారం. ఆయన మరణ వార్త విన్న తర్వాత బాలయ్య… జయప్రకాష్ రెడ్డి గారు నాకు అత్యంత ఆత్మీయులు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి ఎన్నో విభిన్న చిత్రాల్లో మేము కలిసి నటించాము. ఆయన రంగస్థలం నుండి వచ్చిన వారు కాబట్టి ఆయన సినిమా రంగాన్ని, నాటక రంగాన్ని 2 కళ్ళుగా భావించేవారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా నాటకాలు ప్రదర్శించేవారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను అని అన్నారు.

జయప్రకాష్ రెడ్డి కుటుంబానికి బాలకృష్ణ 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చెయ్యడంతో టాలీవుడ్ ప్రముఖులంతా షాకవుతున్నారు. స్నేహపూర్వకంగానే బాలయ్య జయప్రకాష్ రెడ్డి కుటుంబానికి ఆర్థిక సాయం చేశాడా.? లేదంటే నిజంగానే జయ ప్రకాష్ రెడ్డి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందా అనే సందేహాలు సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ రూపంలో వెలుగులోకి వస్తున్నాయి. నిజంగానే లెజెండరీ నటుడు అనే స్థాయికి ఎదిగిన వ్యక్తికి ఆర్థిక ఇబ్బందులున్నాయా..? జయప్రకాష్ రెడ్డి చనిపోయిన ఫ్లాట్ మాత్రం చాలా చిన్నది. పెంట్ హౌజ్‌లో ఉన్నాడని ఎవరికైనా యిట్టె అర్ధమవుతుంది. మరి జయప్రకాష్ రెడ్డి మరణం వెనక అసలు కథేంటి అని తెలియాలంటే మాత్రం కొన్నిరోజులు వేచి చూడాల్సిందే.!

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago