ప్రముఖ టాలీవుడ్ నటుడు, కమెడియన్ కమ్ విలన్ జయప్రకాశ్ రెడ్డి మరణవార్తతో టాలీవుడ్‌లో విషాదం అలుముకుంది. జయప్రకాష్ రెడ్డి ఇక లేరని తెలిసి షాకైంది సినీ లోకం. గుంటూరులోని కొరిటపాడు శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ఆయన కుమారుడు చంద్రప్రకాశ్ రెడ్డి అంత్యక్రియలను నిర్వహించారు.

జయప్రకాశ్ రెడ్డి గుండెపోటుతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయారు. హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే ఆయన మరణానికి టాలీవుడ్ మాత్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా సంతాపం ప్రకటించారు. అయితే టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ గొప్ప మనస్సు చాటుకున్నారు. ఆయన జయ ప్రకాష్ కుటుంబానికి 10 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందించారని తాజా సమాచారం. ఆయన మరణ వార్త విన్న తర్వాత బాలయ్య… జయప్రకాష్ రెడ్డి గారు నాకు అత్యంత ఆత్మీయులు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి ఎన్నో విభిన్న చిత్రాల్లో మేము కలిసి నటించాము. ఆయన రంగస్థలం నుండి వచ్చిన వారు కాబట్టి ఆయన సినిమా రంగాన్ని, నాటక రంగాన్ని 2 కళ్ళుగా భావించేవారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా నాటకాలు ప్రదర్శించేవారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను అని అన్నారు.

జయప్రకాష్ రెడ్డి కుటుంబానికి బాలకృష్ణ 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చెయ్యడంతో టాలీవుడ్ ప్రముఖులంతా షాకవుతున్నారు. స్నేహపూర్వకంగానే బాలయ్య జయప్రకాష్ రెడ్డి కుటుంబానికి ఆర్థిక సాయం చేశాడా.? లేదంటే నిజంగానే జయ ప్రకాష్ రెడ్డి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందా అనే సందేహాలు సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ రూపంలో వెలుగులోకి వస్తున్నాయి. నిజంగానే లెజెండరీ నటుడు అనే స్థాయికి ఎదిగిన వ్యక్తికి ఆర్థిక ఇబ్బందులున్నాయా..? జయప్రకాష్ రెడ్డి చనిపోయిన ఫ్లాట్ మాత్రం చాలా చిన్నది. పెంట్ హౌజ్‌లో ఉన్నాడని ఎవరికైనా యిట్టె అర్ధమవుతుంది. మరి జయప్రకాష్ రెడ్డి మరణం వెనక అసలు కథేంటి అని తెలియాలంటే మాత్రం కొన్నిరోజులు వేచి చూడాల్సిందే.!



























