ఆరోగ్యంగా.. ఫిట్ గా ఉంటేనే ఏ పని అయినా చేయగలం. ఇలా ఉండాలని కూడా చాలా మంది అనుకుంటారు. సినిమాలో ఫిట్ గా ఉండాలని దర్శకులు చెబితే మాత్రం వర్క్ అవుట్ చేయడం తప్పదు. ఇలా సెలబ్రిటీలు ఫిట్‌నెస్, ఆరోగ్యంపై ఫోకస్ ఎక్కువగా పెడుతుంటారు. అందంగా ఉండాలన్నా.. శరీర ఆకృతి ఆకర్శనీయంగా కనపడాలంటే రెగ్యులర్ గా జిమ్ సెషన్ ఉండేలా చూసుకుంటున్నారు. తెలుగులో టాప్ హీరోయిన్ లో కొనసాగుతున్న పూజా హెగ్డే కూడా ఇదే ఫాలో అవుతోంది.
ఆమె జిమ్ కు వెళ్లి వర్క్ అవుట్లు చేస్తూ.. చెమటోడుస్తూ తెగ కష్టపడుతోంది. తాజా ఆ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ చూస్తే.. ఆమె ఎంతలా వర్కవుట్ చేస్తుందో మనకు అర్థం అవుతుంది. గ్రే టీ షర్ట్, రెడ్ జిమ్ ప్యాంట్స్ వేసుకున్న పూజాహెగ్డే తన జిమ్ ట్రైనర్ తో కలిసి వర్కవుట్ చేసింది. అంతేకాకుండా ఆమె ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అదేంటంటే.. ‘మీరు మీ శరీరాన్ని గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు.. అది చల్లగా కనిపిస్తుంది.. అంటూ వీడియో క్యాప్షన్ ఇచ్చింది’.
మరోవైపు వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా.. స్టిల్ ఫొటోగ్రాఫర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేసింది. వివిధ రకాల కెమెరాలను తన చేతిలో పట్టుకొని.. వివిధ యాంగిల్ లో ఫొటోలు తీస్తూ.. తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఎల్లప్పుడూ తన వెనుకాలే ఉంటూ.. తన ఫొటోలను బంధించే రాక్ స్టార్ ఫొటో గ్రాఫర్లందరికీ శుభాంకాక్షలు తెలియజేశారు.
ప్రస్తుతం ఆమె.. ప్రభాస్ తో రాధేశ్యామ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 2022 సంక్రాంతి కి ఈ సినిమాను విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా మరో వైపు విజయ్ తో బీస్ట్, అక్కినేని అఖిల్ తో “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” చాత్రాల్లో నటిస్తోంది. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ ఫోటోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…