Movie News

ఇది బిగ్ బాస్ షోనా.. రొమాన్స్ షోనా.. స్విమ్మింగ్ పూల్ లో ఏంటి ఆ దరిద్రం అంటూ?

సాధారణంగా సినిమాలపై సెన్సార్ నిబంధనలు ఉండటం వల్ల సినిమాలు అసభ్యకరంగా మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలు ఉంటే వాటిని కట్ చేస్తూ సెన్సార్ బోర్డ్ సినిమాలను విడుదల చేస్తుంది. అయితే సెన్సార్ షిప్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కంటెంట్‌పై లేకపోవటం వల్ల ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు వెబ్ సిరీస్ లో ఎక్కువగా శృంగార భరితమైన సన్నివేశాలు, బోల్డ్ సీన్లు ఉంటున్నాయి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి  ‘బిగ్ బాస్ ఓటీటీ’ షోలో కూడా కాస్త బోల్డ్ డోస్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది . ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ లు హద్దులు మీరి ప్రవర్తించడంతో ఈ షోపై ప్రేక్షకుల్లో ఆసక్తిని కనబరుస్తున్నారు.తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ లు స్విమ్మింగ్ పూల్ చేసిన రచ్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోని కొందరు కంటెస్టెంట్ లు స్విమ్మింగ్ పూల్ లో చేరి ఒకరిపై ఒకరు నీళ్ళు చల్లుకుంటూ కనిపించారు. ఇంటి పనుల విషయంలో ఎంతో కఠినంగా పోట్లాడుకునే కంటెస్టెంట్ లు ఈ విధంగా స్విమ్మింగ్ పూల్ లో సరదాగా కనిపించడంతో ఈ కార్యక్రమంపై కొంతమేర ఆసక్తి నెలకొంది.

నేహా భాసిన్‌, నిశాంత్ భట్‌, జీషన్ ఖాన్, మిళింద్ గాబా,పూల్‌లో బాగా ఎంజాయ్ చేశారు. మొదట డ్రస్‌తోటే నీళ్లలోకి దిగిన నేహ ఆ తర్వాత స్విమ్ సూట్ వేసుకొని పూల్ లో రచ్చ చేశారు. అప్పటికే అక్కడికి వచ్చిన రిధిమా పంటిట్‌ను వారితో జాయిన్ అవమని పిలవగా ఆమె స్విమ్మింగ్ పూల్ లోకి దిగక పోయినప్పటికీ అక్కడే నిలబడి వారిని ఎంకరేజ్ చేస్తూ సందడి చేసింది. అయితే ఈషో చూసిన నెటిజన్లు ఇది బిగ్ బాస్ షోనా..లేక రోమాన్స్ షోనా అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago