సాధారణంగా సినిమాలపై సెన్సార్ నిబంధనలు ఉండటం వల్ల సినిమాలు అసభ్యకరంగా మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలు ఉంటే వాటిని కట్ చేస్తూ సెన్సార్ బోర్డ్ సినిమాలను విడుదల చేస్తుంది. అయితే సెన్సార్ షిప్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కంటెంట్‌పై లేకపోవటం వల్ల ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు వెబ్ సిరీస్ లో ఎక్కువగా శృంగార భరితమైన సన్నివేశాలు, బోల్డ్ సీన్లు ఉంటున్నాయి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి ‘బిగ్ బాస్ ఓటీటీ’ షోలో కూడా కాస్త బోల్డ్ డోస్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది . ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ లు హద్దులు మీరి ప్రవర్తించడంతో ఈ షోపై ప్రేక్షకుల్లో ఆసక్తిని కనబరుస్తున్నారు.తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ లు స్విమ్మింగ్ పూల్ చేసిన రచ్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోని కొందరు కంటెస్టెంట్ లు స్విమ్మింగ్ పూల్ లో చేరి ఒకరిపై ఒకరు నీళ్ళు చల్లుకుంటూ కనిపించారు. ఇంటి పనుల విషయంలో ఎంతో కఠినంగా పోట్లాడుకునే కంటెస్టెంట్ లు ఈ విధంగా స్విమ్మింగ్ పూల్ లో సరదాగా కనిపించడంతో ఈ కార్యక్రమంపై కొంతమేర ఆసక్తి నెలకొంది.
నేహా భాసిన్, నిశాంత్ భట్, జీషన్ ఖాన్, మిళింద్ గాబా,పూల్‌లో బాగా ఎంజాయ్ చేశారు. మొదట డ్రస్‌తోటే నీళ్లలోకి దిగిన నేహ ఆ తర్వాత స్విమ్ సూట్ వేసుకొని పూల్ లో రచ్చ చేశారు. అప్పటికే అక్కడికి వచ్చిన రిధిమా పంటిట్‌ను వారితో జాయిన్ అవమని పిలవగా ఆమె స్విమ్మింగ్ పూల్ లోకి దిగక పోయినప్పటికీ అక్కడే నిలబడి వారిని ఎంకరేజ్ చేస్తూ సందడి చేసింది. అయితే ఈషో చూసిన నెటిజన్లు ఇది బిగ్ బాస్ షోనా..లేక రోమాన్స్ షోనా అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.

































